ఇటు కరోనాతో యుద్ధం.. అటు సంక్షేమ పథం

దేశమంతా కరోనా పేరు జపిస్తోంది. ప్రభుత్వాలు కూడా ఎక్కువ ప్రాధాన్యం దీనికే ఇస్తున్నాయి. అధికార యంత్రాంగం మొత్తం కరోనా వైపు టర్న్ అయింది. మరి సంక్షేమం సంగతేంటి? కరోనా బాధితుల్ని పక్కనపెడితే మిగతా వారి…

దేశమంతా కరోనా పేరు జపిస్తోంది. ప్రభుత్వాలు కూడా ఎక్కువ ప్రాధాన్యం దీనికే ఇస్తున్నాయి. అధికార యంత్రాంగం మొత్తం కరోనా వైపు టర్న్ అయింది. మరి సంక్షేమం సంగతేంటి? కరోనా బాధితుల్ని పక్కనపెడితే మిగతా వారి పరిస్థితేంటి? అందుకే ముఖ్యమంత్రి జగన్ అన్ని విధాలుగా ఆలోచించి అడుగులేస్తున్నారు. ఓవైపు కరోనాపై యుద్ధం చేస్తూనే.. మరోవైపు సంక్షేమ పథకాల్ని కూడా అమలుచేస్తూ అన్ని వర్గాల్ని ఆదుకుంటున్నారు.

ఇండియాలోనే అత్యథికంగా కరోనా టెస్టులు జరుగుతున్న రాష్ట్రంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. ఈ ఘనత కేవలం సీఎం జగన్ ది మాత్రమే. కరోనా కేసులు అప్పుడప్పుడే పెరుగుతున్న టైమ్ లో.. ఇంకా చెప్పాలంటే ఢిల్లీ మర్కజ్ వ్యవహారం బయట పడకముందే భారీ ఎత్తున పరీక్షలు నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కొరియా నుంచి కిట్స్ తెప్పించి మరీ పెద్ద ఎత్తున పరీక్షలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రోజూ పదుల సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నాయంటే దానికి కారణం జగన్ ముందుచూపు. కిట్స్, వసతులు లేక అరకొరగా పరీక్షలు చేస్తే ఈపాటికి ఎంతోమంది అమాయకుల్ని కరోనా కబలించి ఉండేది.

ముమ్మరంగా పరీక్షలు నిర్వహిస్తూనే… మరోవైపు ఐసోలేషన్ వార్డులు, మందులు, రెడ్ జోన్లు, పౌష్టికాహారం వంటి అంశాలపై దృష్టిపెట్టారు జగన్. అటు లాక్ డౌన్ మినహాయింపులపై కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. అధికారుల్ని టెన్షన్ పెట్టకుండా, తను టెన్షన్ పడకుండా అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ చూపిస్తున్నారు.

ఇలా ఓవైపు కరోనాపై యుద్ధం సాగిస్తూనే, మరోవైపు సంక్షేమం బాట వీడ లేదు జగన్. కరోనా టైమ్ లో పేదలకు రేషన్ అందిస్తూనే, ఆర్థిక సాయం కూడా అందేలా చేశారు. చివరికి  తెల్ల కార్డు లేనివాళ్లకు కూడా రేషన్ అందేలా చర్యలు తీసుకొని అందరితో శభాష్ అనిపించుకున్నారు. అదే ఊపులో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని కూడా ప్రారంభించి, లక్షలాది మంది మహిళలకు లబ్ది చేకూర్చారు.

కరోనా రాకతో అన్ని సంక్షేమ ఫలాలు ఆగిపోతాయని భయపడిన పేదలకు భరోసా కల్పించారు జగన్. ఇప్పుడు విద్యార్థులకు కూడా శుభవార్త అందించారు. జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించారు. కరోనాకు ముందే వసతి దీవెన పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి, ఇప్పుడు విద్యాదీవెన పథకాన్ని ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్ని కాలేజీలకు చెల్లించడంతో పాటు.. విద్యార్థులకు పూర్తి ఫీజును రీఇంబర్స్ మెంట్ చేయబోతున్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నప్పటికీ జగన్ మాత్రం సంక్షేమం బాట వీడలేదు.

ఓవైపు కరోనా కష్టాలు, మరోవైపు ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు ఆగవనే విషయాన్ని సున్నా వడ్డీ పథకం, విద్యాదీవెన పథకాలతో నిరూపించారు ముఖ్యమంత్రి. జులైలో ఏకంగా 27 లక్షల ఇళ్ల పట్టాలు కూడా అందజేయబోతున్నారు. ఓవైపు కరోనాపై తీసుకుంటున్న చర్యలతో, మరోవైపు సంక్షేమ పథకాలతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు సీఎం జగన్.

ఉమా ఓ సారి ఆ టెస్టు చేయించుకో

అబ్బా కొడుకులు ఎక్కడ దాక్కున్నారు ?