కరోనా రెండో దశ దాదాపు ముగిసినట్లే. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరవడానికి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాయి.
దాంతో ధియేటర్ల దుమ్ము దులిపి, సినిమాల విడుదలకు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే తొలిసారిగా ఓ సినిమావిడుదల ప్రకటన వచ్చేసింది.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన తిమ్మరసు సినిమాను ఈ నెల 30న విడుదల చేయబోతున్నారు. సత్యదేవ్ హీరోగా తయారైన ఈ సినిమాకు ఓ తమిళ సూపర్ హిట్ సినిమా ఆధారం.
ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈసినిమాకు శ్రీచరణ్ పాకల సంగీతం అందించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మాత.
కొవిడ్ రెండో దశ అనంతరం యు ఎస్ లో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా కూడా ఇదే.