రెండున్నర కోట్ల రెమ్యూనిరేషన్ తో టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా వున్న పూజా హెగ్డే ఖాతాలో రెండు క్రేజీ ప్రాజెక్టులు చేరాయి. ఇప్పటికే మహేష్ బాబు-త్రివిక్రమ్ సరసన చేస్తున్న పూజ ఆ తరువాత హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతోంది. దాంతో పాటే తమిళ హీరో ధనుష్-వెంకీ అట్లూరి కాంబినేషన్ కు కూడా సై అనేసింది.
ఈ మూడు సినిమాల డేట్ లు చూసుకుని నితిన్ తో సినిమా చేయడం అన్నది ఆధారపడి వుంటుందని తెలుస్తోంది. మహేష్ బాబు సినిమా అయిపోయేసరికి పవన్ సినిమా ప్రారంభం అవుతుంది. పవన్ సినిమాతో పాటు సమాంతరంగా ధనుష్ సినిమా ప్రారంభం అవుతుంది.
హారిక హాసిని కాంపౌండ్ లోనే ఎన్టీఆర్ సినిమా, బన్నీ, మహేష్, ధనుష్ సినిమాలు పూజా చేయడం విశేషం. సమంత తరువాత తివిక్రమ్ హాట్ ఫేవరట్ హేరోయిన్ గా మారిపోయింది పూజా.
అందుకే ఆయన స్వంత బ్యానర్ లాంటి హారిక లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.