సినిమా రిలీజై సక్సెస్ అయిన తర్వాత బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కామన్. ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ చాన్నాళ్లుగా నడుస్తోంది. సినిమా హిట్ తో బెంజ్ కార్లు, ఖరీదైన ఫ్లాట్లు బహుమతులుగా అందుకున్న జనాలు చాలామంది ఉన్నారు. అయితే తన సినిమా విడుదలకు ముందే గిఫ్ట్ అందుకున్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాకు వర్క్ చేస్తున్నాడు దేవిశ్రీప్రసాద్. పుష్ప పార్ట్-1 విడుదలకు ఇంకా చాలా టైమ్ ఉంది. అంతలోనే బన్నీ నుంచి బహుమతి అందుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్. 'రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్' అనే లైటింగ్ నేమ్ బోర్డ్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించి, డీఎస్పీకి స్పెషల్ గిఫ్ట్ గా అందించాడు బన్నీ.
ఊహించని విధంగా వచ్చిన ఈ బహుమతిని చూసి దేవిశ్రీ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి దేవిశ్రీ ఇలా బహుమతులు అందుకోవడం ఇదే తొలిసారి కాదు. చాలాసార్లు ఇలా ప్రత్యేక బహుమతులు అందుకున్నాడు. రీసెంట్ గా ఉప్పెన సినిమా హిట్టయినప్పుడు కూడా చిరంజీవి నుంచి ఓ గిఫ్ట్ అందింది.
దేవిశ్రీ-బన్నీ మధ్య అనుబంధం వెరీ స్పెషల్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే. అందుకే ఆ అనుబంధంతో దేవికి ఇలా ముందుగానే చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. పుష్ప హిట్టయితే, పెద్ద గిఫ్ట్ అందుకుంటాడు దేవి.