పవన్ కల్యాణ్ ను ఓ నాయకుడిగా చూడడం లేదు

జనసేన పార్టీ అధ్యక్షుడాయన. ఎక్కడికెళ్లినా పవర్ స్టార్ అనే నినాదాలు. చుట్టూ వేల మంది జనం. గజమాలలతో సత్కారాలు. చంద్రబాబు లాంటి నాయకుడు ప్రేమించమని వెంటపడుతున్నాడు. ఇదీ పవన్ కల్యాణ్ కు ఆ పార్టీ…

జనసేన పార్టీ అధ్యక్షుడాయన. ఎక్కడికెళ్లినా పవర్ స్టార్ అనే నినాదాలు. చుట్టూ వేల మంది జనం. గజమాలలతో సత్కారాలు. చంద్రబాబు లాంటి నాయకుడు ప్రేమించమని వెంటపడుతున్నాడు. ఇదీ పవన్ కల్యాణ్ కు ఆ పార్టీ జనాలు ఇచ్చుకునే ఎలివేషన్లు. కానీ అంత సీన్ లేదని తేల్చిపారేశారు మినిస్టర్ రోజా. ఆయనను అసలు తాము రాజకీయ నాయకుడిగా చూడడం లేదంటూ గాలి తీసేశారు.

“పవన్ కల్యాణ్ ను ఓ నాయకుడు అనుకుంటున్నారు చాలామంది. కానీ మేం అనుకోవడం లేదు. మేమే కాదు, ప్రజలు కూడా అనుకోవట్లేదు. నిజంగా ప్రజలు అనుకుంటే కనీసం ఒక చోట అయినా గెలిపించి ఉండేవారు. టైమ్ పాస్ పాలిటిక్స్ చేసేవాళ్లను మేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క చోట కూడా గెలవలేని మనిషి, ఏకంగా ముఖ్యమంత్రి అయిపోవాలని వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాడు.”

అలాంటి వ్యక్తి గురించి మాట్లాడ్డానికేం లేదంటూ సింపుల్ గా తేల్చి పడేశారు రోజా. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి.. పవన్ తో పాటు చంద్రబాబుపై కూడా విమర్శలు చేశారు. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, కనీసం ఈ మహానాడులోనైనా ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు తన జీవితం మొత్తం 420 పనులకే అంకితమయ్యారని ఆరోపించారు రోజా. కేవలం జగన్ ను తిట్టడం కోసమే మహానాడు పెట్టుకున్నారని, ఫ్యాన్ (వైసీపీ గుర్తు) దెబ్బకు చంద్రబాబు, లోకేష్ పిచ్చెక్కి తిరుగుతున్నారని విమర్మించారు.