దర్శకుడు త్రివిక్రమ్ కొత్త పద్దతి స్టార్ట్ చేసారట. వాస్తవానికి ఈ పద్దతి మరీ కొత్తది కాదు. దర్శకుడు రాజమౌళి చేసిందే. ఆయన భారీ సినిమాలు తీస్తాడు కాబట్టి, వర్క్ షాప్ కండక్ట్ చేస్తాడు. ఎన్టీఆర్ అయినా, ప్రభాస్ అయినా, రామ్ చరణ్ అయినా, రాజమౌళి చెప్పినట్లు వర్క్ షాప్ లకు అటెండ్ కావాల్సిందే. రిహార్సల్ చేయాల్సిందే.
ఇప్పుడు ఇదే పద్దతికి దర్శకుడు త్రివిక్రమ్ కూడా శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మూడు నాలుగు రోజుల షాట్ లు అన్నీ ఒకేసారి రెడీ చేసుకుని, వన్ డే వర్క్ షాప్ ఏర్పాటు చేసి, ఫుల్ గా రిహార్సల్ చేయిస్తున్నారట. రిహార్సల్ అయిన మర్నాటి నుంచి మూడు, నాలుగు రోజులు చకచకా షూట్ చేస్తారన్నమాట.
మళ్లీ మరో రోజు ఓన్లీ రిహార్సల్ చేసి, మూడు నాలుగు రోజులు షూట్ కు వెళ్తారన్నమాట. త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న బన్నీ సినిమాకు ఇదే పద్దతి పాటిస్తున్నారు. బన్నీ కూడా రిహార్సల్ కు హాజరవుతున్నారు. ఇక మిగిలిన కాంబినేషన్ ఆర్టిస్టుల సంగతి చెప్పనక్కరలేదు. వారంతా ముందే రెడీ. కానీ దీనివల్ల కాల్ షీట్ లు పెరుతాయోమో? లేదా టేక్ లు తక్కువై, వర్క్ స్పీడ్ అవుతుందో? త్రివిక్రమ్ కే తెలియాలి.