అనిల్ రావిపూడి- తగ్గడం లేదు

మహేష్ సినిమా మహర్షికి భారీగా ఖర్చయిపోయింది. సినిమా బాగానే వుంది అనిపించుకోవడంతో, దిల్ రాజు అండగా వుండడంతో, సమ్మర్ లో సరైన సినిమా అన్నది ఇప్పటి వరకు రాకపోవడంతో, సినిమా మెల్లగా గట్టెక్కిపోయింది. లేదూ…

మహేష్ సినిమా మహర్షికి భారీగా ఖర్చయిపోయింది. సినిమా బాగానే వుంది అనిపించుకోవడంతో, దిల్ రాజు అండగా వుండడంతో, సమ్మర్ లో సరైన సినిమా అన్నది ఇప్పటి వరకు రాకపోవడంతో, సినిమా మెల్లగా గట్టెక్కిపోయింది. లేదూ అంటే అంత ఖర్చు రాబట్టడం కష్టం అయ్యేది. అయితే తరువాత సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో, సినిమాను చకచకా తీస్తాడని, కాస్త రీజనబుల్ బడ్జెట్ లో తీస్తాడని, నిర్మాతలకు ఈసారి మంచి లాభాలు వుంటాయని లెక్కలు ముందే కట్టేసారు.

వాస్తవానికి అనిల్ రావిపూడి స్టయిల్ కూడా అంతే. పైగా సినిమాకు నాన్ థియేటరికల్ రైట్స్ కు మహేష్ కు ఇచ్చేస్తున్నారు. ఇక రెమ్యూనిరేషన్ లేదు. అందువల్ల 70 కోట్లలో సినిమా రెడీ అవుతుంది. నిర్మాతలు అనిల్ సుంకర, దిల్ రాజులకు చాలా మంచి లాభాలు వుంటాయని వార్తలు వినిపించాయి. ఎందుకంటే థియేటర్ హక్కులు కనీసం 120 కోట్ల వరకు వుండే అవకాశం వుంది కనుక.

అయితే ఇప్పుడు వేరే రకమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు కూడా ప్రొడక్షన్ కాస్ట్ కాస్త ఎక్కువే అవుతుందని తెలుస్తోంది. స్టార్ట్ కాస్ట్ మాత్రమే కాకుండా, మేకింగ్ వాల్యూస్ లో కూడా కాస్త గట్టిగా, ఓ రేంజ్ లో వుండేలా చూస్తున్నారట. క్వాలిటీ ఎక్కడా తగ్గకుండా వుండాలని నిర్మాతలు, ఫస్ట్ పెద్ద సినిమా కాబట్టి, తను కూడా ఆ రేంజ్ లో ప్రొడక్ట్ ఇవ్వాలని దర్శకుడు భావిస్తున్నారట. అందువల్ల ఈసారి వితవుట్ మహేష్ రెమ్యూనిరేషన్ మేకింగ్ 90 కోట్ల వరకు వుంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

దీనికితోడు ఈసారి సంక్రాంతికి బన్నీ-త్రివిక్రమ్, రజనీ కాంత్ సినిమాలు వుంటాయని, అలాగేవుంటే గింటే నాగ్ సినిమా కూడా వుండే అవకాశం వుందని, అందువల్ల బయ్యర్లు బేరాలు ఆడే పరిస్థితి వుంటుందని అంటున్నారు. అయితే మహర్షి మార్కెట్ చేసిన ఫిగర్లకు మాత్రం తగ్గదని, వాస్తవానికి పెరగాల్సి వుండేది, సంక్రాంతి పోటీ కారణంగా పెరగకపోవచ్చని బిజినెస్ వర్గాల బోగట్టా.

ప్రొడక్షన్ కాస్ట్, బిజినెస్ సంగతి అలావుంచితే, స్టార్ కాస్ట్ కాంబినేషన్, డైరక్టర్ కాంబినేషన్ రీత్యా ఈ సినిమాకు బజ్ మాత్రం ఓ రేంజ్ లో వుంటుంది. అది గ్యారంటీ.

ఓటమిపాలైనా తుదిశ్వాస దాకా రాజకీయాల్లోనే – పవన్