ఒక్కోసారి భలే చిత్రమైన గ్యాసిప్ లు వస్తుంటాయి. ముందు ఒకలా.. తరువాత మరొకలా.. కీర్తి సురేష్ ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. అయితే అసలు ఆమె ఆ సినిమా ఓకె అనకపోను, ఎన్టీఆర్ గెస్ట్ గా చేస్తాడు అని నిర్మాత చెప్పి, ఒప్పించారు అంటూ, పేరు, ఊరు లేకుండా గ్యాసిప్ వండి వార్చారు. మళ్లీ ఇప్పుడు లేటెస్ట్ గా పేరు, ఊరుతోటే, ఎన్టీఆర్ ఆ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు అంటూ వార్తలు వండి వారుస్తున్నారు.
కానీ వినిపిస్తున్న నిజం వేరుగా వుంది. ఇంతవరకు ఈ సినిమా గురించి ఎన్టీఆర్ అస్సలు అడగనే లేదు అన్నది. అలాగే ఎన్టీఆర్ చేయడం కూడా లేనే లేదు అన్నది. ఆ సినిమా నిర్మాతకు ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం వుంటే వుండొచ్చు గాక, అంత మాత్రం చేత అంత పెద్ద హీరోను తన చిన్న సినిమాలో కనిపించమని కోరేంత వ్యవహారం వుండదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
ముందు వచ్చిన గ్యాసిప్ కానీ, లేటెస్ట్ గా వచ్చిన వార్తలు కానీ రెండూ నిజాలు కావని, నిర్మాతను కాస్త ఇరుకున పెట్టడానికి ఇదంతా ఎవరో చేస్తున్నారని, నిర్మాత సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. నిర్మాతకు ఎన్టీఆర్ కు మధ్య వున్న సంబంధాలు దెబ్బతీయాలని ఇలాంటి గ్యాసిప్ లు ఎవరో పుట్టిస్తున్నారని ఆ వర్గాలు అంటున్నాయిు.
ప్రస్తుతానికి అయితే ఎన్టీఆర్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడం అన్నది యూనిట్ ఆలోచనల్లో లేదని స్పష్టంచేసాయి.