Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సుధీర్ బాబు మిస్సయిన చాన్స్

సుధీర్ బాబు మిస్సయిన చాన్స్

ఒక్కోసారి టైమ్ మరీ బాగుంటే అవకాశాలు ఒకేసారి వస్తాయి. అయోమయంలో పడేస్తాయి. సుధీర్ బాబు పరిస్థితి అలాగే అయింది. బాలీవుడ్ లో మంచి చాన్స్ మిస్ అయిపోయింది. సమ్మోహనం సినిమా తరువాత గోపీచంద్ బయోపిక్ తన స్వంత బ్యానర్ లో స్టార్ట్ చేసాడు. ఇంతలో ఇంద్రగంటితో దిల్ రాజు నిర్మాణంలో చాన్స్ వచ్చింది. రావడమే కాదు, స్టార్ట్ అయిపోయింది.

అదే సమయంలో ఆ మధ్యలోనే హిందీ సినిమా బ్రహ్మాస్త్రలో అవకాశం వచ్చింది. కానీ ఏం లాభం? వదిలేసుకోవాల్సి వచ్చింది. బ్రహ్మాస్త్ర సినిమా కోసం నాగార్జున, సుధీర్ బాబు ఇలా మరి ఒకరిద్దరు సౌత్ స్టార్స్ ను తీసుకోవాలనుకున్నారు. గతంలో సుధీర్ బాబు ఓ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చేసి వుండడంతో, మళ్లీ అదే షేడ్స్ వున్న పాత్ర ఆఫర్ చేసారు.

ముందు అలాగే అనుకున్నాడు. హ్యాపీ అనుకున్నాడు. కానీ తీరాచేస్తే ఏమయింది. ఇక్కడ సినిమాలు అన్నీ పక్కన పెడితే తప్ప, అక్కడి డేట్ లతో మ్యాచ్ కావడం లేదట. దాంతో చేసేదిలేక, ఓ నమస్కారం పెట్టి ఊరుకున్నాడు. నిజానికి ఏ మాత్రం వీలు చేసుకున్నా ఓ భారీ ప్రాజెక్టులో పార్ట్ అయి వుండేవాడు. అంతేకాదు, బాలీవుడ్ కు మరింత ఎక్కువగా పరిచయం అయివుండేవాడు.

స్వంత సినిమా గోపీచంద్ బయోపిక్ ను కాస్త పక్కనపెట్టి, బాలీవుడ్ ఆఫర్ ఒకె చేసి వుంటే బాగుండేదేమో? కానీ అలా చేయలేదు.. సుధీర్ బాబు ఐడియా ఏమిటో?

ఓటమిపాలైనా తుదిశ్వాస దాకా రాజకీయాల్లోనే - పవన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?