మన్మధుడు 2 సినిమా విడుదలకు రెడీ అవుతోంది. హీరో నాగ్ మళ్లీ ఫ్రీ అవుతున్నారు. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో బంగార్రాజు సినిమా మొదలు పెట్టాలి. నాగ్-నాగచైతన్య-రమ్యకృష్ణ ఇప్పటి వరకు ఫిక్స్ అయిన మెయిన్ కాస్టింగ్. చైతూకి హీరోయిన్ కావాలి. అదే ఇంకా ఫిక్స్ కాలేదు.
అయితే ఈ విషయంలో రెండు ఆప్షన్స్ తో వున్నట్లు తెలుస్తోంది. ఒకటి చైతూ పక్కన సమంతను మరోసారి రిపీట్ చేసే ఆలోచన. అలా అయితే సినిమాకు బజ్ ఓ లెవెల్ లో వుంటుంది. రంగస్థలం, యుటర్న్, మజిలీ, ఓ బేబీ తరువాత సమంత సినిమా అన్నా, సమంత-చైతూ-నాగ్ సినిమా అన్నా దాని రేంజ్ ఓ లెక్కలో వుంటుంది. అయితే ఓ బేబీ అనుకున్న మేరకు హిట్ అయితే ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం వుందని తెలుస్తోంది.
లేదూ అంటే యంగ్ హీరోయిన్ ను ఎవరినైనా తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వెంకీ మాట షూటింగ్ తో చైతూ ఫుల్ బిజీగా వున్నాడు. అది ర్యాప్ చేయగానే బంగార్రాజు సినిమా మీదకు రావాలి. అది పూర్తయిన తరువాత యువిలో మేర్లపాక గాంధీతో సినిమా చేస్తాడు.