Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మన్మధుడు 2లో సమంత ఏమిటి?

మన్మధుడు 2లో సమంత ఏమిటి?

మన్మధుడు 2లో రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్. ఆ సంగతి తెలిసిందే. అయితే కీర్తిసురేష్, సమంత కూడా గెస్ట్ రోల్స్ వేస్తున్నారు. కానీ ఆ పాత్రలు ఏమిటి? అన్నదే పాయింట్. ఐ డూ అనే ఫ్రెంచ్ సినిమా హక్కులు కొని, మన్మధుడు 2 సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో పెళ్లికోసం, అద్దె పెళ్లాం కోసం ట్రయ్ చేస్తూ హీరో పలువురిని కలుస్తాడు. ఇప్పుడు అలా కలిసేవాళ్ల పాత్రలనే కీర్తి సురేష్, సమంత అండ్ కో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిది కూడా జస్ట్ గెస్ట్ రోల్స్ మాత్రమే అని, సినిమాకు జస్ట్ మరింత బజ్ రావడం కోసం వాళ్లని తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.

అయితే అద్దె భార్యల అన్వేషణలో భాగంగా సమంత ను నాగ్ కలుస్తాడా? లేక వేరే గెస్ట్ రోల్ ఏమైనా వుందా అన్నది తెలియాల్సి వుంది. నాగ్ ఫ్యామిలీకి సమంత సెంటిమెంట్ ఐకాన్ గా మారుతోంది. డౌన్ ట్రెండ్ లో వున్న చైతన్యకు మజిలీ హిట్ ఇచ్చింది. అంతముందు అన్నపూర్ణ బ్యానర్ కే మనం సినిమా పెద్ద పేరు తెచ్చింది. అందుకే ఓ గెస్ట్ రోల్ లో సమంతను లక్కీ ఐకాన్ గా ఫిక్స్ చేసారేమో?

ఓటమిపాలైనా తుదిశ్వాస దాకా రాజకీయాల్లోనే - పవన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?