టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పూజా హెగ్డే మరో సినిమాకు సైన్ చేసింది. యంగ్ హీరో నితిన్ సరసన నటించబోతోంది.
Advertisement
నితిన్ స్వంత బ్యానర్ మీద నిర్మించే ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు. నా పేరు సూర్య తరువాత వక్కంతం దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే.
అంథాదూన్ రీమేక్ మాస్ట్రోను ఫినిష్ చేసిన తరువాత నితిన్ చేసేది ఈ సినిమానే. పూజా హెగ్డే ప్రస్తుతం మహేష్ సినిమా చేస్తోంది. దాంతో పాటే నితిన్ సినిమా కూడా చేస్తుంది.
నితిన్ హీరోయిన్ల ఎంపికలో జాగ్రత్తగా వుంటున్నాడు. రష్మిక, కీర్తి సురేష్, పూజా హెగ్డే ఇలావుంది లైనప్. దీని తరువాత సినిమాకు కూడా ఓ క్రేజీ హీరోయిన్ ను తీసుకుంటున్నారు.