వరుణ్ తేజ్ హీరోగా తయారవుతున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో తయారవుతున్న ఈ సినిమా నిర్మాతల్లో అల్లు అరవింద్ కుమారుడు బాబి ఒకరు.
ఇప్పుడు ఈ సినిమా నాన్ థియేటర్ హక్కులను గీతా సంస్థ కీలక నిర్వహకుడు, బన్నీ వాస్ తీసుకున్నారు.
డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ హక్కుల మూడింటిని కలిపి 21 కోట్లకు బన్నీ వాస్ తీసుకున్నారు. అయితే ఆయన వాటిని వుంచుకుంటారని కాదు.
ఆయన మళ్లీ మారుబేరానికి విక్రయిస్తారు. ఇదో రకం వ్యాపారం. ఓ ఏడాది కాలంగా ఈ తరహా వ్యాపారం లోకి కూడా బన్నీ వాస్ దిగారు. అందులో భాగంగానే గని హక్కులు కొనుగోలు చేసారు.
గని సినిమా కోసం వరుణ్ తేజ్ బాగా మేకోవర్ అయ్యారు బాడీ పెంచి హల్క్ మాదిరిగా మారారు. ఈ సినిమా చాలా వరకు పూర్తయింది.