టాలీవుడ్ ను తిట్టి, మళ్లీ తెలుగులోనే సినిమా..!

హీరోయిన్ తాప్సి, టాలీవుడ్ పై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావునే పరోక్షంగా విమర్శించిన ట్రాక్ రికార్డ్ ఆమెది. ఓ హీరోను కూడా పరోక్షంగా టార్గెట్ చేసి డీగ్రేడ్ చేసింది.…

హీరోయిన్ తాప్సి, టాలీవుడ్ పై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావునే పరోక్షంగా విమర్శించిన ట్రాక్ రికార్డ్ ఆమెది. ఓ హీరోను కూడా పరోక్షంగా టార్గెట్ చేసి డీగ్రేడ్ చేసింది. అలాంటి తాప్సికి తెలుగులో మరో అవకాశం వచ్చింది.

ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయతో దర్శకుడిగా నిరూపించుకున్న స్వరూప్, తాప్సి లీడ్ రోల్ గా ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి మిషన్ ఇంపాజిబుల్ అనే టైటిల్ పెట్టారు. ఈరోజు నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ నిరంజన్ రెడ్డి నిర్మాత. టాలీవుడ్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేసి, ఇండస్ట్రీని చీప్ గా చూసిన తాప్సిని వీళ్లంతా కలిసి ఇలా మరోసారి ఎంకరేజ్ చేస్తున్నారు.

ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేయడానికి చాలామంది ఉన్నారు. అనుష్క నుంచి తీసుకుంటే సాయిపల్లవి, కీర్తిసురేష్, నిత్యామీనన్, శ్రద్ధాశ్రీనాధ్, అంజలి.. ఇలా బడ్జెట్ బట్టి చేయడానికి చాలామంది హీరోయిన్లు అందుబాటులో ఉన్నారు. నటనలో, క్రేజ్ లో తాప్సి కంటే వీళ్లు తక్కువేం కాదు, రెమ్యూనరేషన్, కాల్షీట్ల పరంగా కూడా అందుబాటులోనే ఉన్నారు. కానీ మేకర్స్ మాత్రం తాప్సినే ఇష్టపడ్డారు.

అలా నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో మరోసారి స్ట్రయిట్ మూవీ చేస్తోంది తాప్సి. ఈ సందర్భంగా ఆమె గతంలో టాలీవుడ్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఫన్నీ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందులో మచ్చుకు కొన్ని ఇక్కడ..

– అదేంటో టాలీవుడ్ లో మేకర్స్ బొడ్డు అంటే పడి చచ్చిపోతారు. అస్తమానం నడుము, నాభి చూపించడానికి వెంపర్లాడుతుంటారు. బొడ్డుపై పుచ్చకాయలు, గుమ్మడికాయలు వేస్తేనే వాళ్లకు ఇష్టం.

– కెరీర్ స్టార్టింగ్ లో నెపొటిజం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. ప్రముఖుల వారసులతోనే సినిమాలు చేయడానికి మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా నాకు కొన్ని అవకాశాలు చేజారిపోయాయి.

– తెలుగులో స్టార్టింగ్ లో గ్లామర్ రోల్స్ చేయడం వల్ల 3 పాటలు, 5 సీన్లు ఉండే పాత్రలే వస్తున్నాయి. మంచి క్యారెక్టర్స్ ఆఫర్ చేయడం లేదు.

– సౌత్ లో కొంతమంది నాతో నటించడానికి భయపడుతున్నారు.

– ఓ తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. స్టోరీ బాగా నచ్చింది. ఓకే చెప్పాను. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. కానీ కొన్ని రోజులకు నిర్మాతలు మళ్లీ వచ్చారు. హీరోపైనే సినిమా బడ్జెట్ ఆధారపడి ఉంటుందని, అతడికి అంత మార్కెట్ లేదు కాబట్టి నన్ను రెమ్యూనరేషన్ తగ్గించుకోమన్నారు. ఆ హీరోకి మార్కెట్ లేకపోతే, నేనెందుకు పారితోషికం తగ్గించుకోవాలి.