ఇక చాలు…వింటే న‌వ్విపోతారు!

టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు తానేం మాట్లాడుతున్నారో అర్థం కాన‌ట్టుంది. త‌న మాట‌లు విన్న జ‌నం న‌వ్వుకుంటార‌నే స్పృహ కూడా ఆయ‌న‌లో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.  Advertisement జ‌గ‌న్‌పై ఒక వేలు చూపుతే, మిగిలిన నాలుగు…

టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు తానేం మాట్లాడుతున్నారో అర్థం కాన‌ట్టుంది. త‌న మాట‌లు విన్న జ‌నం న‌వ్వుకుంటార‌నే స్పృహ కూడా ఆయ‌న‌లో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

జ‌గ‌న్‌పై ఒక వేలు చూపుతే, మిగిలిన నాలుగు వేళ్లు త‌న వైపు చూపుతాయ‌నే విష‌యాన్ని ఆయ‌న మ‌రిచిన‌ట్టున్నారు. కేవ‌లం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల కోస‌మే విమ‌ర్శ‌ల‌న్న తీరుగా అచ్చెన్న వైఖ‌రి అవుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ మోసం వ‌ల్లే యువ‌త ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటోంద‌ని విమ‌ర్శించారు. క‌ర్నూలు జిల్లా చ‌నుగొండ్ల గ్రామంలో నిరుద్యోగి గోపాల్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ‘నేను వున్నాను.. నేను విన్నాను.. నేను చూశాను’ అన్నది 10 వేల ఉద్యోగాల ఖాళీలేనా జగన్ రెడ్డి? అని వ్యంగ్యంగా ప్ర‌శ్నించారు.

ఇంటికోక ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పి.. రెండేళ్లలోనే కోటి మందికి ఉపాథి పోగొట్టిన ఘనత జగన్‌దేనని అచ్చె న్నాయుడు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. ప్రత్యేక హోదాపై యువతను జగన్ దారుణంగా దగా చేశారని మండిపడ్డారు. హోదా తేవడం చేతగాదని జగన్ చేతు లేత్తెశారని, దీనిపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌త్యేక హోదా వ‌ద్దు, ప్యాకేజీ ముద్దు అని చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేసిన అచ్చెన్నాయుడు మ‌రిచిపోయిన‌ట్టున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

ప్యాకేజీ కోసం ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టు పెట్టి, కేంద్రంలో మంత్రి ప‌ద‌వుల‌ను చేప‌ట్టి రాష్ట్రానికి తీర‌ని ద్రోహం చేశార‌నే కార‌ణంతోనే ప్ర‌జాగ్ర‌హానికి గుర‌య్యామ‌ని ఇప్ప‌టికీ అచ్చెన్నాయుడు గ్ర‌హించ‌క‌పోవ‌డం విడ్డూరంగా ఉందంటున్నారు. 

ప్ర‌తి కుటుంబానికి ఉద్యోగం లేదా నెల‌నెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి అని హామీ ఇచ్చి, నెర‌వేర్చ‌ని ఘ‌న‌త టీడీపీద‌ని ఎవ‌రిని అడిగినా చెబుతారు. కానీ త‌మ పాల‌న‌లోని లోపాల‌ను విస్మ‌రించి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం అచ్చెన్న‌కే చెల్లింది.