కొంతమంది తమ ప్రేమ, పెళ్లి విషయాన్ని భలేగా దాచిపెడతారు. ఓవైపు ఎన్ని పుకార్లు వచ్చినా, మరో హీరోతో ఎఫైర్ అంటూ గాసిప్స్ అల్లినా, అసలు విషయాన్ని మాత్రం బయటపెట్టరు. వాళ్లు చెప్పే వరకు బయట ప్రపంచానికి ఆ మేటర్ తెలియదు. శ్రియ, కాజల్, ప్రణీత లాంటి హీరోయిన్ల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు మరో హీరోయిన్ సంజనా గల్రానీ కూడా అదే విషయాన్ని బయటపెట్టింది.
శాండిల్ వుడ్ హీరోయిన్ సంజనా గల్రానీ, బెంగళూరుకు చెందిన డాక్టర్ అజీత్ రహస్యంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి కోసమే సంజన, ఇస్లాం తీసుకుంది. ఆ తర్వాత వాళ్ల పెళ్లి ఫొటోలు కూడా బయటకొచ్చాయి. అయితే సంజన-అజీజ్ కు ఎన్నాళ్లుగా పరిచయం అనే విషయం మాత్రం చాలామందికి తెలియదు.
సంజన స్వయంగా ఈ మేటర్ ను బయటపెట్టింది. తన భర్త పేరును మెడ వెనక భాగంపై పచ్చబొట్టు పొడిపించుకున్న ఈ ముద్దుగుమ్మ, 15 ఏళ్లుగా అజీజ్ తో తన ప్రయాణం సాగుతోందనే విషయాన్ని తాజాగా బయటపెట్టింది. ఒక విధంగా చెప్పాలంటే సంజన కెరీర్ స్టార్టింగ్ నుంచే అజీజ్ తో పరిచయం ఉందన్నమాట.
ఇన్నాళ్లూ సీక్రెట్ గా దాచిన తన పచ్చబొట్టు మేటర్ ను బయటపెట్టిన సంజన.. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సుదీర్ఘ వ్యాసం రాసుకొచ్చింది. గతంలో తనపై ఎన్ని పుకార్లు వచ్చాయో బయటపెట్టింది. సోదరుడితో సమానమైన వ్యక్తితో కూడా లింకప్ పెట్టి గాసిప్స్ రాశారని బాధపడింది. క్రికెటర్, పొలిటీషియన్, సినిమా స్టార్ తో కనిపిస్తే రిలేషన్ షిప్ అంటగట్టారని వాపోయింది.
ఇన్ని పుకార్లు, ఊహాగానాలు చెలరేగినప్పటికీ నిజమైన ప్రేమ ఎప్పుడూ నిలబడుతుందని, నిజమైన ప్రేమికులు ఒకరికి ఒకరు అండగా ఉంటారని అంటోంది సంజన. అలాంటి అండ తనకు అజీజ్ రూపంలో దొరికిందని తెలుపుతూ.. సోషల్ మీడియా వేదికగా అతడికి ఐ లవ్ యూ చెప్పింది.
గడిచిన 15 ఏళ్లుగా అజీజ్ తో తనకు పరిచయం ఉందని, ఓ స్నేహితుడిగా, మార్గదర్శిగా, ప్రేమికుడిగా, భర్తగా అజీజ్ తన వెన్నంటే ఉన్నాడని అంటోంది సంజన. ఇలా తన రిలేషన్ షిప్ లో ఓ కొత్త కోణాన్ని, కొత్త టాటూను బయటపెట్టింది ఈ హీరోయిన్.