ప్రభుత్వాన్ని నడపడం లేదు.. మేనేజ్ చేస్తున్నామంతే

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంలో రోజు ఒక ఆడియో, వీడియో క్లిప్ ల రాజ‌కీయం న‌డుస్తుంది. తాజ‌గా క‌ర్ణాట‌క న్యాయ‌శాఖ మంత్రి జేసీ మ‌ధుస్వామి ఓ ఆడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో లీకై బీజేపీ ప్ర‌భుత్వని ఇర‌క‌టంలో…

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంలో రోజు ఒక ఆడియో, వీడియో క్లిప్ ల రాజ‌కీయం న‌డుస్తుంది. తాజ‌గా క‌ర్ణాట‌క న్యాయ‌శాఖ మంత్రి జేసీ మ‌ధుస్వామి ఓ ఆడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో లీకై బీజేపీ ప్ర‌భుత్వని ఇర‌క‌టంలో పెడుతోంది. 

చెన్నపట్నానికి చెందిన సామాజిక కార్యకర్త భాస్కర్ తో మంత్రి మధుస్వామి శనివారం ఫోన్‌లో మాట్లాడారు. అందులో సహకార బ్యాంకుపై అతను చేసిన ఫిర్యాదులపై మధుస్వామి స్పందిస్తూ  “మేము ఇక్కడ ప్రభుత్వాన్ని నడపడం లేదు.. మేనేజ్ చేస్తున్నామంతే. రాబోయే ఏడెనిమిది నెలల వరకు మేనేజ్ చేస్తాం ”  అని అన్నారు. జేసీ మధుస్వామి వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో సీఎం బసవరాజ్‌ బొమ్మై దిద్దుబాటు చర్యలకు దిగారు. మంత్రి వ్యాఖ్యల్ని తప్పుడు అర్థంలో తీసుకోవద్దని కోరారు.  

ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారితే రాజీనామాకు సిద్ధమని కర్ణాటక న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి స్పష్టం చేశారు. సీఎంకు, పార్టీకి మేలు జరుగుతుందనుకుంటే తాను సంతోషంగా రాజీనామా చేస్తానని అన్నారు. 

ఈ ఆడియో క్లిప్ ప్ర‌తిప‌క్ష‌ల‌కు అయ‌ధంగా త‌య‌రైంది. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్, జ‌న‌తాద‌ళ్(ఎస్‌) రాజ‌కీయ పార్టీలు మంత్రి రాజీనామాకు ప‌ట్టుప‌డ్డాయి. కొంత మంది బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు కూడా మంత్రి నిజ‌మే మాట్ల‌డారాని ప్ర‌భుత్వం న‌డ‌ప‌డం బీజేపీకి చేత కావ‌డం లేదంటూ విమ‌ర్శిస్తున్నారు. సీఎంగా బసవరాజ్ అధికారం చెప్ప‌టిన‌ప్ప‌టి నుండి రోజుకు ఒక బీజేపీ నేత‌ల వ‌ల‌న బీజేపీ ప‌రువు పోతోందంటూ పార్టీలోనే అంతర్గతంగా చ‌ర్చించుకుంటున్నారు.