అల్లు శిరీష్…అల్లు అరవింద్ అబ్బాయి. చాలా యాక్టివ్ గా వుంటాడు అటు సోషల్ మీడియాలో కానీ, ఇటు రెగ్యులర్ లైఫ్ లో కానీ. కేవలం సినిమాలు అనే కాదు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ నే. అలాంటి అల్లు శిరిష్ గత కొంతకాలంగా గాయబ్ అయ్యాడు.
అసలు హైదరాబాద్ లో వుండడం లేదు. ముంబాయిని అడ్డా చేసుకుని వుండిపోయాడు. చేస్తున్న సినిమా ఒకటి వుంది. ప్రేమ కాదంట అనే ఆ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. రాకేష్ శశి దర్శకుడు. ఈ సినిమా ఏమయిందో, దాని పొజిషన్ ఏమిటో తెలియుదు.
చేపట్టిన ప్రతి టాస్క్ ను సక్సెస్ బాట పట్టించే అల్లు అరవింద్ తన రెండో కొడుకు కెరీర్ ను ఎందుకు ప్రాపర్ గా ప్లాన్ చేయడం లేదో అంతకన్నా తెలియదు. ఈ లోగా టాలీవుడ్ లో గమ్మత్తయిన గ్యాసిప్ వినిపిస్తోంది. అల్లు శిరీష్ తండ్రి అల్లు అరవింద్ మీద అలిగాడన్నది ఆ గ్యాసిప్. అందుకే ఇక్కడ వుండకుండా ముంబాయిలో వుంటున్నాడని.
నిజానికి ఇక్కడ వున్నపుడు కూడా తండ్రితో కాకుండా తనే ఒంటరిగా ఓ ఇంట్లో వుంటూ వచ్చాడు శిరీష్. మరి ఇప్పుడు ఈ గ్యాసిప్ ఎందుకు వినిపిస్తోందో తెలియదు. ముఖ్యంగా అల్లు అన్నదమ్ములకు ఒకరితో ఒకరు వాదించుకోవడం, కలహించుకోవడం కామన్ అని, కానీ మళ్లీ కలవడం అంతకన్నా కామన్ అని అంటున్నారు. అలాగే ఈసారి కూడా అల్లు శిరీష్ అలిగి దూరంగా వుంటున్నాడని అంటున్నారు.
ఇలా గ్యాసిప్ వినిపిస్తోందని తెలిస్తే కామ్ వుండే రకం కాదు అల్లు శిరీష్..ఏదో పోస్ట్ పెట్టే వ్యవహారం. చూడాలి అప్పుడయినా క్లారిటీ వస్తుందేమో?