తమిళంలో సూపర్ హిట్ అయిన మానాడు సినిమాను తెలుగులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. హీరో రానా ఈ సినిమాకు తెలుగులో ఒక నిర్మాత. ఆసియన్ సునీల్ మరో నిర్మాత. ఈ సినిమాను పెర్ ఫెక్ట్ గా తెరకెక్కించాలని రానా పట్టుదలగా వున్నారు.
ఈ సినిమాలో రవితేజ నటిస్తున్నారని వార్తలు ఇప్పటికే బయటకు వచ్చాయి. సినిమాలోని మరో కీలక పాత్రకు సిద్దు జొన్నలగడ్డ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఈ సినిమాలో కామెడీ ట్రాక్ ను, కామెడీ ఇంప్రూవ్డ్ వెర్షన్ ను తయారుచేసే బాధ్యతను దర్శకుడు అనిల్ రావిపూడికి నిర్మాత రానా అప్పగించినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి కామెడీ రైటింగ్ స్కిల్, టైమింగ్ తెలిసిన రానా ప్రత్యేకంగా ఈ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.
మానాడు సినిమాను తెలుగులో తీయాలని చాలా మంది అనుకున్నారు. కానీ రానా ఆ హక్కులు దక్కించుకున్నారు. త్వరలో ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. ఈ లోగా ఢమాకా షూట్ ను రవితేజ ఫినిష్ చేస్తారు. మరో వారం రోజులు వర్క్ చేస్తే ఆ సినిమా అయిపోతుంది.
అలాగే రావణాసుర సినిమా కూడా ఎక్కువ వర్క్ లేదు. అది కూడా త్వరలోనే పూర్తవుతుంది. ఆ వెంటనే మానాడు రీమేక్ స్టార్ట్ చేస్తారు.