ప్రధానే తెలంగాణకు శత్రువు అయ్యారు!

తాను కలలు కన్న బంగారు తెలంగాణ త్వరలోనే వస్తుందని సీఎం కేసీఆర్ ఆశభావం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం వికారాబాద్ జిల్లా జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో…

తాను కలలు కన్న బంగారు తెలంగాణ త్వరలోనే వస్తుందని సీఎం కేసీఆర్ ఆశభావం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం వికారాబాద్ జిల్లా జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తుందని, బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతోందన్నారు. అలాగే ప్ర‌ధాని నరేంద్ర మోడీపై విమ‌ర్శ‌లు కురిపించారు. తెలంగాణ రాష్ట్రా సాధ‌న కోసం చావు అంచుదాకా వెళ్లనంటు మ‌రో సారి గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్ప‌డ‌క‌పోతే ఇవాళ వికారాబాద్ జిల్లా అయ్యేదా అని ప్ర‌శ్నించారు.

57ఎండ్ల నిండిన 10 లక్షల మందికి నిన్నటి నుంచి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఎన్నికలు వస్తే రకరకాల వాళ్లు మీ ముందుకు వస్తుంటారని, ప్రజలు అన్నీ విని ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులతో ఇప్పుడున్న పరిస్థితులను బేరీజ్ వేసుకోవాలని కోరారు. ఉద్యమంలో లేనోళ్లు అడ్డుపొడుగు మాట్లాడుతున్నారని, మాట్లాడేవాళ్లు మాట్లాడుతూనే ఉంటారని, ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఎనిమిదేళ్ల అధికారంలో ఉన్న మోడీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఏం మేలు చేశారో చెప్పార‌ని మోడీని నిల‌దీశారు. మేలు చేయ‌క‌పోగా రైతు బందు లాంటి ప‌థ‌కాల‌ను ర‌ద్దు చేయాల‌ని చూస్తున్నారంటూ కేసీఆర్ విమ‌ర్శించారు. బీజేపీ నాయ‌కులు మాట‌లు న‌మ్మితే వ్య‌వ‌సాయ మీట‌ర్లు వ‌స్తాయ‌న్నారు. బీజేపీ నాయ‌కులు సంప‌ద‌ను అంత దోచి పెద్ద పెద్ద షావుకార్లకు ఇస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ద‌మ్ముంటే రాష్ట్ర బీజేపీ నేత‌లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని స‌వాల్ విసిరారు. బీజేపీ జెండా పట్టుకొని నా బస్‌కు అడ్డం వసార్తా?. వికారాబాద్‌కు నేనేం తక్కువ చేశానో ప్రజలు చెప్పాలి. బీజేపీని నమ్ముకుంటే మనకు మళ్లీ పాత రోజులే వస్తాయి. ఎన్నో పోరాట‌లు, తాగ్యాలు చేసి సాధించుకున్న‌ తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అయితే రాష్ట్రం బాగుంటేనే సరిపోదని, దేశం కూడా బాగుండాలని హితవు పలికారు.