నితీష్ కు హోం …తేజస్వికి ఆరోగ్యం

బీజేపీతో తెగ‌దెంపులు చేసుకొని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అయిన ఆర్జేడీ తో జ‌త క‌ట్టిన జేడీ(యూ) కొత్త ప్ర‌భుత్వంను ఏర్పాటు చేసిన ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ ఇవాళ త‌న క్యాబినేట్ ను ఏర్పాటు చేశారు. Advertisement…

బీజేపీతో తెగ‌దెంపులు చేసుకొని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అయిన ఆర్జేడీ తో జ‌త క‌ట్టిన జేడీ(యూ) కొత్త ప్ర‌భుత్వంను ఏర్పాటు చేసిన ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ ఇవాళ త‌న క్యాబినేట్ ను ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీహార్ కొత్త క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి తేజస్వీ ప్రసాద్ యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌తో సహా దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఊహించినట్లుగానే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీకి మంత్రి పదవుల్లో సింహభాగం దక్కింది. 

కేటాయించిన పోర్ట్‌ఫోలియోల జాబితా ప్రకారం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నితీష్ హోం శాఖను కొనసాగించగా, తేజస్వికి ఆరోగ్య శాఖ ఇవ్వనున్నారు. ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో 16 మంది ఆర్జేడీ, 11 మంది జేడీ(యూ), ఇద్దరు కాంగ్రెస్, ఒకరు మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) నుంచి ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు ఉన్నారు.

ఈ ఉదయం బీహార్ రాజధాని పాట్నాలోని రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాగు చౌహన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. దీంతో సీఎం నితిష్ తో కలిపి మంత్రివర్గం సంఖ్య 32కు చేరింది. నితిష్-తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఎన్ని రోజులు కొన‌సాగుతుందో అనేది ముందు ముందు తెలుస్తుంది.