చాలా రోజుల నుండి వస్తున్న ఊహాగానాలకు బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు స్వస్తి చెప్పారు. బిపాసా బసు మరియు తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ కలిసి తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు.
తన అధికారిక ఇన్ స్టా లో తన ప్రెగ్నెన్సీ పోటోలు పంచుకున్నారు. ప్రెగ్నెన్సీ షూట్ తో ఫొజులిచ్చిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ జంట వైట్ అండ్ వైట్ బట్టలు ధరించి కనిపించారు. ఈ జంట ఏప్రిల్ 2016 లో వివాహం చేసుకున్నారు.
బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు గర్భం దాల్చినట్టు చాలా రోజులుగా వార్తొలొస్తున్నాయి. కానీ బిపాసా, కరణ్ సింగ్ ఆ విషయం గురించి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ జంట అధికారిక ప్రకటన చేశారు.
“ఒక కొత్త సమయం, ఒక కొత్త దశ, కొత్త కాంతి. మేం ఈ జీవితాన్ని వ్యక్తిగతంగా ప్రారంభించాం. కానీ ఆ తర్వాత మేం ఒకరినొకరు కలుసుకున్నాం. ఎప్పుడైతై కలిశామో.. అప్పట్నుంచే ఇద్దరమే. ఒప్పుడు ఇద్దరుగా ఉన్న మేం ఇప్పుడు ముగ్గురం కాబోతున్నాం. మన ప్రేమ ద్వారా వ్యక్తమైన సృష్టి, మా పాప మనతో కలిసిపోతుంది. మీ షరతులు లేని ప్రేమ, మీ ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు‘‘ అంటూ తన ఇన్ స్టా లో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం బిపాస బేబీ బంప్ ఫొటోలు వైరల్ గా మారాయి.