కార్తికేయ 2…ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్

నిఖిల్-అనుపమ కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన కార్తికేయ 2 తొలి మూడు రోజులు మంచి ఫలితాలు నమోదు చేసింది. మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడం విశేషం. తొలి…

నిఖిల్-అనుపమ కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన కార్తికేయ 2 తొలి మూడు రోజులు మంచి ఫలితాలు నమోదు చేసింది. మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడం విశేషం. తొలి రోజు కన్నా మలి రోజు, మలి రోజు కన్నా మూడో రోజు మంచి కలెక్షన్లు కనిపించాయి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ కావడం అన్నది కార్తికేయ 2 కు కలిసి వచ్చింది. ఆ సినిమాను చాలా చోట్ల థియేటర్లలోంచి తీసి ఈ సినిమా వేసారు.

ఆంధ్ర 6 కోట్లు మేరకు అన్ని ఏరియాలు కలిపి విక్రయించారు. తొలి మూడు రోజుల్లో 5.65 కోట్లు అది కూడా జిఎస్టీ కలపకుండా వచ్చింది. అలాగే నైజాం నాలుగు కోట్లు అడ్వాన్స్ మీద విడుదల చేసారు. అక్కడ జిఎస్టీ కలపకుండా 3.88 కోట్లు వచ్చింది. సీడెడ్ ను 2 కోట్ల అడ్వాన్స్ మీద ఇచ్చారు. అక్కడ జిఎస్టీ కలపకుండా 1.81 కోట్లు వచ్చింది.

అంటే దాదాపు బ్రేక్ఈవెన్ అయిపోయినట్లే. అడ్వాన్స్ లు, నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ల మీద సినిమాను విడుదల చేయడంతో నిర్మాతలకు మాంచి ఓవర్ ఫ్లోస్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. హిందీ బెల్ట్, ఓవర్ సీస్, తెలుగు ఏరియాల నుంచి మంచి ఓవర్ ఫ్లోస్ వస్తాయి. వడ్డీలు, పబ్లిసిటీ అన్నీ కలిపి 28 కోట్లు ఖర్చయిన ఈ సినిమా విడుదల నాటికి జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. ఇప్పుడు లాభాలు వస్తాయి.

Andhra

1.64 cr….day 1, 1.89 cr….day 2, 2.12 cr….day 3

Nizam

1.14 cr….day 1, 1.28 cr….day 2, 1.46 cr….day 3

Ceaded

0.58 cr..…day 1, 0.59 cr…day 2, 0.64 cr…day 3