లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఉరేసుకున్న యువకుడు

మొన్నటికిమొన్న బయట తిరగొద్దని గట్టిగా చెప్పినందుకు భార్యపై కోపంతో సిద్ధిపేట జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఈసారి రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.…

మొన్నటికిమొన్న బయట తిరగొద్దని గట్టిగా చెప్పినందుకు భార్యపై కోపంతో సిద్ధిపేట జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఈసారి రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఈ విషాధం చోటుచేసుకుంది.

మొయినాబాద్ మండలం చినమంగళారం గ్రామానికి చెందిన సాయి అనే పాతికేళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ప్రతిరోజూ సాయంత్రం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేవాడు సాయి. కొన్ని రోజుల పాటు గమనించిన తండ్రి, ఇక ఆగలేక గట్టిగా మందలించాడు.

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ఈ టైమ్ లో రాత్రిపూట అలా తిరగడం మంచిది కాదన్నాడు తండ్రి. దీంతో సాయి మనస్తాపానికి గురయ్యాడు. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాయికి ఎలాంటి ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలు లేవని.. కేవలం లాక్ డౌన్ సమయంలో బయట తిరగొద్దని తండ్రి మందలించడం వల్లనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడంటున్నారు స్థానికులు.

లోకమణి అమ్మకి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు