బాబు బాగా బిజీ సినిమా గుర్తుందా..నటుడు అవసరాల శ్రీనివాస్ ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఆ సినిమా నిర్మాత, దర్శకుడు మళ్లీ ఇప్పటి వరకు సినిమా చేయలేదు.
ఇన్నాళ్ల తరువాత ఇదే కాంబినేషన్ లో హీరో కళ్యాణ్ రామ్ సినిమా అనౌన్స్ చేసారు. నిర్మాత అభిషేక్-దర్శకుడు నవీన్ మేడారం కలిసి చేస్తున్న ఈ సినిమా పేరు డెవిల్.
వాస్తవానికి ఏజెంట్ వినోద్ అని పెడదాం అనుకున్నారని బోగట్టా. కానీ ఈలోగా అఖిల్ సినిమా కు ఏజెంట్ అనే పేరు ఫిక్స్ చేసేసారు. దాంతో దీనికి డెవిల్ అని ఫిక్స్ చేసారు.
గతంలో వెల్లడించినట్లే ఈ సినిమాలో హీరో బ్రిటిష్ కాలం గూఢచారిగా కనిపిస్తాడు. అతగాడి లవ్ స్టోరీ అన్నమాట ఇది. విజువల్ ఎఫెక్ట్స్ కు చాలా స్కోప్ వున్న పీరియాడిక్ లవ్ థ్రిల్లర్.
కళ్యాణ్ రామ్ ఇప్పటికే ఓ హిస్టారికల్ ఫాంటసీ ని 'బింబిసార' టైటిల్ తో చేస్తున్నారు. ఇప్పుడు ఇది రెండోదన్న మాట.