తబ్లిగీ ముగిసింది… రంజాన్ వచ్చింది

భారతదేశంలో.. అందులోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విదేశాల నుంచి వచ్చిన కరోనా కేసుల కంటే.. స్వదేశంలో అంటుకున్నవే ఎక్కువ. ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో తొలికేసు ఇటలీ నుంచి వచ్చిన ఓ స్థానిక విద్యార్థి. ఆ…

భారతదేశంలో.. అందులోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విదేశాల నుంచి వచ్చిన కరోనా కేసుల కంటే.. స్వదేశంలో అంటుకున్నవే ఎక్కువ. ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో తొలికేసు ఇటలీ నుంచి వచ్చిన ఓ స్థానిక విద్యార్థి. ఆ తర్వాత నమోదైన కేసులన్నీ ఢిల్లీ ప్రార్థనలతో అంటుకున్నవే. ఒక్కటంటే ఒక్కటి కూడా విదేశాల నుంచి వచ్చిన, లేదా వారితో సన్నిహితంగా ఉన్న కేసు లేదు. ఒక్క నెల్లూరే కాదు, డబుల్ సెంచరీ దాటి దూసుకుపోతున్న కర్నూలు, గుంటూరు, జస్ట్ సెంచరీ క్రాస్ చేసిన కృష్ణా జిల్లాల్లో కూడా అత్యథిక భాగం ఢిల్లీ ప్రార్థనలతో సంబంధం ఉన్న కేసులే.

హైదరాబాద్ లో కూడా ఎక్కువ శాతం కేసులకు ఢిల్లీ లింక్ లు ఉండటంతో ఓ దశలో సామాన్య జనం హడలిపోయారు. ఢిల్లీకి వెళ్లొచ్చినవారంటేనే అనుమానంగా చూశారు. సరే అయిందేదో అయిపోయింది. కరోనా వ్యాప్తికి ఓ వర్గాన్ని నిందించడం సరికాదని అందరూ సంయమనం పాటించారు. ఇప్పుడు కథ మళ్లీ మొదటికొచ్చే అవకాశం కనిపిస్తోంది.

రంజాన్ సందర్భంగా సామూహిక ప్రార్ధనలు వద్దంటూ అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వేడుకుంటున్నాయి. ఇమామ్ లతో కూడా సందేశాలిప్పించారు అధికారులు. ఎక్కడికక్కడ అధికారులు స్థానిక మసీదుల వద్దకు వెళ్లి ఇమామ్, మౌజమ్ మినహా ఇంకెవరూ ప్రార్థనల కోసం మసీదుల వద్దకు రాకూడదని.. వారినుంచి లిఖితపూర్వకంగా హామీ తీసుకున్నారు. కానీ అనుకున్నదొకటి, అయింది మరొకటి.

రంజాన్ మాసం మొదటిరోజే.. నెల్లూరు జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించారు. నెల్లూరు నగరంలోని మసీదుకి ప్రార్థనల కోసం జనం తరలివచ్చారు. మతపెద్దగా ఉన్న ఓ వ్యక్తి చేతిని మసీదుకి వచ్చిన భక్తులంతా ముద్దుపెట్టుకుంటూ తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. సాధారణ రోజుల్లో దీన్ని ఎవరూ ఆక్షేపించరు, అసలు సమస్యే లేదు. కానీ కరోనా కల్లోలం ఉన్న ఈ రోజుల్లో.. సామాజిక దూరం పాటించాలని ఎంత చెబుతున్నా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇలాంటి చర్యలు సరికాదు.

ఉదయాన్నుంటే మీడియా ఛానెళ్లన్నీ ఈ విషయంపై ఫోకస్ పెట్టాయి. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారని కథనాలిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అధికారులు కూడా చేయగలిగిందేమీ లేదు. ఎవరికి వారే సంయమనం పాటించి, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉంటేనే కరోనాని కట్టడి చేయగలం. లేకపోతే తబ్లిగీ చేసిన నష్టం కంటే ఎక్కువ రంజాన్ మాసం చేసే ప్రమాదం ఉంది.

విశ్వాసాల పేరుతో పండగ పవిత్రతని చెడగొట్టి, విమర్శకుల నోటికి మరింత పదును పెరిగేలా చేస్తారా.. లేక తీరు మార్చుకుని లాక్ డౌన్ కి పూర్తి స్థాయిలో సహకరిస్తారా.. వేచి చూడాలి. 

లోకమణి అమ్మకి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు