దిల్ రాజు టెన్షన్..టెన్షన్

ఎన్నో సినిమాలు తీసారు నిర్మాత దిల్ రాజు. ఏ సినిమాకు టెన్షన్ పడలేదు. హిట్ కొట్టి తీరాలి అనుకున్నారు తప్ప, అలా హిట్ కొట్టడం కోసం స్ట్రాటజీలు రచించలేదు..కిందా మీదా అయిపోలేదు. కానీ తొలిసారి…

ఎన్నో సినిమాలు తీసారు నిర్మాత దిల్ రాజు. ఏ సినిమాకు టెన్షన్ పడలేదు. హిట్ కొట్టి తీరాలి అనుకున్నారు తప్ప, అలా హిట్ కొట్టడం కోసం స్ట్రాటజీలు రచించలేదు..కిందా మీదా అయిపోలేదు. కానీ తొలిసారి ఆయన టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన రీమేక్ వకీల్ సాబ్ విషయంలో ఆయన కొంచెం కలవరపడుతున్నట్లు కనిపిస్తోంది. 

సినిమాకు బిజినెస్ విషయంలో ప్రోబ్లెమ్ లేదు. ఆంధ్ర 42 కోట్ల మేరకు బిజినెస్ చేసారు. ఇది చాలా ఎక్కువే. అయితే టికెట్ ధరలు పెంచుకోవడం, వీలయినంత స్క్రీన్ లు వేసుకోవడం, ఫిక్స్ డ్ రెంటల్స్ ఇలాంటి వాటి వల్ల బిజినెస్ జరిగిపోయే అవకాశం వుంది. సినిమాకు బజ్ అవసరం లేదు. ఎందుకంటే పవన్ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

మరి దేనికి సమస్య అంటే, సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు? మీడియా ఎలా స్పందిస్తుంది? సినిమాకు యునానిమస్ హిట్ టాక్ రావాల్సి వుంది. లేదంటే పరిస్థితి ఎలా వుంటుంది? అన్నింటికి మించి పవన్ ప్రమోషన్లకు వచ్చే అవకాశం తక్కువ. ఏం చేసినా భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తోనే. 

ఇలాంటి నేపథ్యంలో తొలిసారి దిల్ రాజు తన పీఆర్ టీమ్ ను కూడా మార్చారు. ఓ లీడింగ్ ఎంటర్ టైన్ మెంట్ చానెల్, ఓ పాపులర్ న్యూస్ చానెల్ కు పని చేసేవారిని తీసుకవచ్చి మీటింగ్ పెట్టినట్లు సమాచారం. వారి సలహాతో కొత్త పీఆర్ టీమ్ కు వకీల్ సాబ్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. 

ఇంతకిందా మీదా కావడం ఎందుకుంటే సినిమాను ప్రొపర్ గా లాంచ్ చేయలేదని కానీ, లేదా మీడియా వ్యవహారాలు సరిగ్గా లేవని కానీ పవన్ ఎక్కడ అనుకుంటారో అన్న టెన్షన్. పైగా సోషల్ మీడియాలో జనసేన-వైకాపా వార్ వుండనే వుంటుంది. 

సినిమా ఫలితం యునానిమస్ గా వుంటే ఓకె. లేదూ అంటే ట్రోలింగ్ మామూలుగా వుండదు. పైగా పింక్ సినిమా చాలా మందికి తెలిసిందే. దాన్ని కమర్షియల్ గా మార్చేసి, ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేసి, ఫైటింగ్ లు కలిపి వకీల్ సాబ్ చేసారు. అది జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది మరో టెన్షన్. 

ఇలా అన్ని విధాలుగా వకీల్ సాబ్ సినిమా నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఈ పరీక్ష పాస్ కావడం మీదే తరువాత లైన్ లో వున్న అనేక మెగా సినిమాలు ఆధారపడి వున్నాయి కూడా.