నిశ్చితార్ధం తరువాత బ్రేకప్ చెప్పేసింది హీరోయిన్ మెహరీన్ తన కాబోయే భర్త బిష్ణుకు. అయితే ఇది అంత సడెన్ గా జరగలేదని, గత కొంతకాలంగా నలుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి నిశ్చితార్థం జరిగి ఎన్నాళ్లో కాలేదు. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. ఈ విషయాన్ని మెహరీన్ నిన్ననే బయట పెట్టినా ముందే ఆమెకు క్లారిటీ వుందని తెలుస్తోంది.
ఎఫ్ 3 షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే వుంటోంది మెహరీన్. కానీ కరోనా కారణంగా అది ఆగింది. ఈలోగా దర్శకుడు మారుతి హీరో సంతోష్ శోభన్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి వార్తల్లో చూసి ఆమెనే స్వయంగా తాను నటిస్తానని అడిగినట్లు తెలుస్తోంది.
అప్పటికే తన పెళ్లి వ్యవహారం గురించి మల్లగుల్లాలు పడుతున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అందుకే తన కెరీర్ ను కొనసాగించాలని మెహరీన్ డిసైడ్ అయినట్లు బోగట్టా.
అసలు కెరీర్ కొనసాగించడం పైనే అభిప్రాయా బేధాలు వచ్చాయని కూడా వినిపిస్తోంది. విదేశాల్లో చదువుకుని వచ్చిన మెహరీన్ కు, సంప్రదాయ బీహార్ పద్దతులకు అలవాటైన బిష్ణు ఫ్యామిలీకి మైండ్ సెట్ మ్యాచ్ కాలేదన్న వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.