Advertisement

Advertisement


Home > Movies - Press Releases

గూడుపుఠాణి ఫస్ట్ లుక్

గూడుపుఠాణి ఫస్ట్ లుక్

ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం గూడు పుఠాణి. సప్తగిరి హీరోగా నటిస్తున్నారు. జోడీగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. 

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఈ ఫస్ట్ లుక్ ను సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేయడం విశేషం. 

ఈ సందర్భంగా హీరో సప్తగిరి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూడుపుఠాణి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. అదే టైటిల్ తో నేను సినిమా చేయడం విశేషం. 

సూపర్ స్టార్ కృష్ణ మా సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది అన్నారు. దర్శకుడు కుమార్ కె.ఎం ఆసక్తికరంగా మూవీని తెరకెక్కించారని తెలిపారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?