శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్ లో మూవీ లాక్ అయింది. నిన్న మరోసారి ధనుష్, కమ్ముల, నిర్మాతలు అంతా కలిసి కూర్చొని ఫైనల్ గా మాట్లాడుకున్నారు. రెమ్యూనరేషన్ తో పాటు, ఎప్పట్నుంచి కాల్షీట్లు కేటాయించాలనే అంశంపై కూడా అంతా చర్చించుకున్నారు. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్స్ క్లూజివ్ మేటర్ ఇది.
ధనుష్ తో కమ్ముల చేయబోయే సినిమా మల్టీస్టారర్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో కీలకమైన ఓ పోలీసాఫీసర్ పాత్ర ఒకటి ఉందట. ధనుష్ తర్వాత సెకెండ్ హీరో రేంజ్ లో ఆ క్యారెక్టర్ ఉంటుందట. ఆ పాత్రను కోలీవుడ్ లేదా టాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద హీరోతో చేయించాలనేది కమ్ముల ప్రతిపాదన. దీనిపై కూడా నిన్న చర్చ జరిగింది.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాన్-ఇండియా మూవీగా ఈ ప్రాజెక్టును తీసుకురావాలనేది నిర్మాతలు, హీరో ఆలోచన. కాబట్టి స్పెషల్ పోలీసాఫీసర్ పాత్రను ఈ 3 భాషలతో కనెక్ట్ అయిన హీరోతో చేయిస్తే బాగుంటుందనేది అందరి కామన్ ఆలోచన.
ప్రస్తుతానికైతే చర్చలు ఇక్కడివరకు మాత్రమే జరిగాయి. మూవీ సెట్స్ పైకి రావడానికి కాస్త టైమ్ పడుతుంది. ధనుష్ చేతిలో ఉన్న సినిమా పూర్తవ్వాలి, కమ్ముల చేతిలో ఉన్న లవ్ స్టోరీ థియేటర్లలోకి రావాలి. ఆ తర్వాత ధనుష్-కమ్ముల సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది.