మా సంఘ ఎన్నికల హడావుడి బుస్ మని లేచి సద్దుమణిగింది. కానీ ఇదంతా బయటకే. కానీ తెరవెనుక ఎవరి శిబిరం వ్యవహారాలు వాళ్లు నడుపేస్తున్నారు.
మంచు విష్ణుకు ప్యానల్ ఇంకా ఏర్పడలేదు. దీని మీద వ్యూహాత్మకంగానే మౌనంగా వున్నారని బోగట్టా. సిట్టింగ్ ప్రెసిడెంట్ నరేష్ తెరవెనుక వ్యవహారాలు అన్నీ చూస్తున్నట్లు బోగట్టా.
అసలు హడావుడి అంతా ముందుగా మొదలెట్టిన నటుడు ప్రకాష్ రాజ్ తన వ్యవహారాలకు తన మిత్రుడు, దర్శకుడు పూరి జగన్నాధ్ ఆఫీసును అడ్డాగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
పూరి ఆఫీసు కేంద్రంగా ఆయన ప్యానల్ కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్యానల్ లో కీలకమైన పలువురు అక్కడికి వచ్చి వ్యూహరచన సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏకగ్రీవం అనే ఆలోచన కు అవకాశం లేకుండా చాలా దూరం వెళ్లిపోయింది వ్యవహారం అనేందుకు వీలుగా ప్రకాష్ రాజ్ అండ్ కో ప్రచారాన్ని, వ్యూహాలను చకచకా ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలకు మరో రెండు నెలల సమయం వుంది. సెప్టెంబర్ లో ఎన్నికలు వుంటాయి. అప్పటి వరకు సాయంకాలాలు డిస్కషన్లు, కబుర్లు కాలక్షేపం ఇలా పూరి ఆఫీసులో కొనసాగుతూనే వుంటాయేమో?