‘మా’ డైరీ లోనూ మోసమేనా?

తెలుగు నటీనటుల సంఘం మా ఎన్నికలు తెచ్చిన హడావుడిలో అసలు విషయాలు ఒక్కొటీ బయటకు వస్తున్నాయి. అసలు అక్కడ ఏమీ లేకుండా ఎందుకీ పోటీ అన్న వారికి సమాధానాలు దొరుకుతున్నాయి.  Advertisement మా అసోసియేషన్…

తెలుగు నటీనటుల సంఘం మా ఎన్నికలు తెచ్చిన హడావుడిలో అసలు విషయాలు ఒక్కొటీ బయటకు వస్తున్నాయి. అసలు అక్కడ ఏమీ లేకుండా ఎందుకీ పోటీ అన్న వారికి సమాధానాలు దొరుకుతున్నాయి. 

మా అసోసియేషన్ ఏటా అందరి ఫొటోలు, చిరునామాలు, ఫోన్ నెంబర్లతో డైరీ ప్రింట్ చేస్తుంది. దాంట్లో ప్రకటనలు వుంటాయి. వాటికి ఎంత చార్జ్ చేస్తారో? మా కు ఎంత ఆదాయం వస్తుందో అన్న సంగతి తెలియదు కానీ ఏటా దాని ప్రింటింగ్ కు ఎనిమిది లక్షల వరకు ఖర్చు అవుతుంది. 

ఇది చిరకాలంగా జరుగుతున్న వ్యవహారం. అంత ఖర్చు అవసరం లేదు అని ఎవరైనా అన్నా కూడా తోసిరాజని ఒకే కాంట్రాక్టర్ కు ఆ డైరీ బాధ్యత అప్పగిస్తూ వస్తున్నారు. ఆఖరికి ఈ ఏడాది అతన్ని కాదని వేరే కంపెనీకి డైరీ ప్రింటింగ్ వ్యవహారం అప్పగించారు. ఈసారి అలా చేయడం వల్ల వచ్చిన ఆదా నాలుగు లక్షలు అని తెలుస్తోంది.

అంటే ఎనిమిది లక్షలకు బదులు నాలుగు లక్షలకే ఇచ్చారన్న మాట. మరి ఇన్ని ఏళ్లుగా నాలుగేసి లక్షలు ఎందుకు అదనంగా ఇచ్చుకుంటూ వెళ్లారు అన్నది మా సభ్యుల ఆఫ్ ది రికార్డు క్వశ్చను. 

ఏటా ఈ విషయంలో కొంత మంది కార్యవర్గంలో వున్నవారికి కూడా అంతో ఇంతో 'టచ్' వుందని పేరు వెల్లడించానికి ఇష్టపడిని మా సభ్యులు చెబుతున్న సమాచారం. 

లక్షలు సంపాదించే సినిమా నటులు కూడా ఇలాంటి చిలక కొట్టుళ్లకు దిగడం ఏమిటో?