హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై 10 కోట్ల రూపాయిల పరువు నష్టం దావా వేయనున్నారు ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ. మరి తెలుగు దేశం పార్టీ అధీనేత చంద్రబాబు మరియు లోకేష్ లు కూడా పరువు నష్టం వేస్తారా. ఎందుకంటే ఏబీఎన్ రాధాకృష్ణ కంటే గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ లను ఉతికి అరేశారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ కాదంటూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియా సమావేశంలో ప్రకటించిన తర్వాత మాధవ్ కూడా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, చంద్రబాబుచ లోకేష్ లను తీవ్ర స్ధాయిలో దుర్భాషలాడారు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న రాధాకృష్ణ పరువు నష్టం దావా వేయనున్నారు.
రాధాకృష్ణ కు పరువు పోయినప్పుడు చంద్రబాబుకు, లోకేష్ కు పరువు పొకుండా ఉంటుందా. గోరంట్ల వ్యాఖ్యలను ఎవరూ సమర్ధించరు కానీ రోజు లేచినప్పటి నుండి మీడియా ముసుగులో ఎంత మందిని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నాం. నారా లోకేష్ కూడా ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టిన సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై వ్యక్తిగతంగా ఎలా మాట్లడుతాడో అలాగే చంద్రబాబు కూడా అలాగే మాట్లాడటం మొదలుపెట్టారు.
ఏబీఎన్ రాధాకృష్ణ తరువాత అందరి దుష్టి చంద్రబాబు, నారా లోకేష్ లపై ఉంది. తండ్రి కొడుకులు కలిసి పరువు నష్టం దావా వేస్తారా లేక రాజకీయాల్లో ఇవ్వని అలవాటులే అని వదిలేస్తారా అనేది తెలియాల్సి ఉంది. కానీ చంద్రబాబు పరువు కోసం పాకులాడే మనిషి కాదు. తన పని కోసం ఎన్ని సార్లు ఐన తనను తానే దిగజార్చుకోనే మనిషి చంద్రబాబు అనేది నగ్నసత్యం. ఇంకా లోకేష్ గురించి చెప్పాలంటే తన భాషతో, తన నడవడికతో తనకు తానే పరువు దిగజార్చుకునే వ్యక్తి మాలోకం లోకేష్.