అల్లు వారి ఆటలు సాగట్లేదు

యువ దర్శకులకి తమ ప్రతిభ చాటుకునే అవకాశం కల్పిస్తోన్న సంస్థలు ప్రస్తుతం చాలా తక్కువే వున్నాయి. దిల్‌ రాజుకి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, అల్లు అరవింద్‌ సంస్థ గీతాఆర్ట్స్‌, సురేష్‌ బాబు సారథ్యంలోని…

యువ దర్శకులకి తమ ప్రతిభ చాటుకునే అవకాశం కల్పిస్తోన్న సంస్థలు ప్రస్తుతం చాలా తక్కువే వున్నాయి. దిల్‌ రాజుకి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, అల్లు అరవింద్‌ సంస్థ గీతాఆర్ట్స్‌, సురేష్‌ బాబు సారథ్యంలోని సురేష్‌ ప్రొడక్షన్స్‌ మినహా మరేవీ యువ దర్శకులకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో యువ దర్శకులు ఈ సంస్థల తలుపులు తడుతున్నారు. కాకపోతే గతంలో అయితే నిర్మాత ఎవరిని చూపిస్తే వారితో సినిమా చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు యువ దర్శకులకి కూడా వాయిస్‌ వచ్చింది.

గీతాఆర్ట్స్‌లో అడుగు పెట్టగానే ఏ దర్శకుడికీ అల్లు అర్జున్‌ని డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ రాదు. ముందుగా అల్లు శిరీష్‌తో సినిమా తీసి టాలెంట్‌ చాటుకోవాలి అనేవారు. మారుతి, పరశురామ్‌ అలా అల్లు శిరీష్‌తో పనిచేసిన వారే. అయితే ఇప్పుడు అల్లు శిరీష్‌తో సినిమా చేయాలనే కండిషన్‌కి డైరెక్టర్స్‌ అంగీకరించడం లేదు. యువ హీరోలు ఎంతో మంది ఫీల్డులో వున్న ఈ టైమ్‌లో పనిగట్టుకుని అల్లు శిరీష్‌తో అదృష్టం పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు. అందులోను ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఇంకా హీరోగా నిలదొక్కుకోలేని అతనిపై ఎవరికీ అంత ఆసక్తిలేదు.

సక్సెస్‌ఫుల్‌ దర్శకులతో వరుసగా పనిచేసిన శిరీష్‌కి దర్శకులు దొరక్కపోవడంతో ఏబిసిడిని కొత్త దర్శకుడితో చేసాడు. ఈ చిత్రం కూడా ఫ్లాప్‌ అయిన నేపథ్యంలో ఇక తదుపరి చిత్రానికి కథ తీసుకొచ్చి తనతో పని చేయడానికి సిద్ధపడే దర్శకుడు ఎక్కడ దొరుకుతాడు? పెట్టుబడి పెట్టే నిర్మాత వున్నంత మాత్రాన, భారీ స్థాయిలో విడుదల చేసుకునే సామర్ధ్యం వున్నంత మాత్రాన వారసులు అంతా హీరోలైపోరు అనేదానికి ఇదే బెస్ట్‌ ఎగ్జాంపులు. 

పదేళ్ల నడక.. పోరాడి.. పోరాడి సాధించిన విజయం