తమిళనాట పుట్టి పెరిగింది సమంత. ఆ తర్వాత టాలీవుడ్ లో క్లిక్ అయింది. ఇప్పుడు ఏకంగా అక్కినేని కోడలు హోదా అందుకుంది. పూర్తిగా హైదరాబాద్ లో సెటిలైపోయింది. ఈ క్రమంలో జీవితంలో తనకు ఎంతో ఇష్టమైన రెండు అంశాల్ని కోల్పోయానంటోంది సమంత. ఇన్నేళ్లలో తను దారుణంగా మిస్ అయిన అంశాలు ఆ రెండు మాత్రమే అని చెబుతోంది.
హైదరాబాద్ లో సెటిలైన తర్వాత సాగర తీరాల్ని పూర్తిగా మిస్ అయిందంట సమంత. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ జీవితంలో బీచ్ ఓ భాగమంట. ఎన్నో పుట్టినరోజు వేడకలు, ఫ్రెండ్స్ తో షికార్లు, తొలి ఫొటో షూట్.. ఇలా ఎన్నో విషయాల్లో చెన్నై బీచ్ తన జీవితంలో ఓ భాగంగా మారిందని, హైదరాబాద్ లో సెటిలైన తర్వాత బీచ్ ను బాగా మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చింది.
ఇక సమంత మిస్ అవుతున్న మరో అంశం బ్రేక్ ఫాస్ట్. చెన్నైలో టిఫిన్స్ చాలా బాగుంటాయంటోంది సమంత. చిన్నప్పట్నుంచి చెన్నైలో బ్రేక్ ఫాస్ట్ చేయడం తనకు అలవాటని, హైదరాబాద్ లో సెటిలైన తర్వాత చెన్నై టిఫిన్స్ మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చింది.
ఈ రెండు అంశాలు తప్ప, చెన్నైకు సంబంధించి తను కోల్పోయింది ఏమీ లేదంటోంది సమంత. కరోనాకు ముందు కనీసం 2-3 నెలలకు ఓసారైనా చెన్నై వెళ్లేదాన్నని, లాక్ డౌన్/కరోనా వల్ల చెన్నై వెళ్లడం తగ్గిపోయిందని, అందుకే బీచ్-బ్రేక్ ఫాస్ట్ ఇంకా ఎక్కువ మిస్ అవుతున్నాననే ఫీలింగ్ కలుగుతోందని చెప్పుకొచ్చింది.