ఏంటో ఇపుడు కరోనా కొత్త వెర్షన్ల పేర్లు చూస్తేనే జనాలు హడలిపోవాల్సివస్తోంది. డెల్టా వేరియెంట్ ప్లస్ అనేది మూడవ దశ కోరోనా వ్యాప్తికి దారితీస్తుందని ఒక వైపు నిపుణులు చెబుతున్న పరిస్థితి.
మరో వైపు చూస్తే కరోనా వేరియెంట్ లో డెల్టా ప్లస్ చాలా ప్రమాదకరమైనది అన్న ప్రచారం ఉంది. ఇవన్నీ ఇలా ఉండగానే విశాఖలో డెల్టా వేరియెంట్ ప్లస్ కేసు ఒకటి వెలుగు చూసిందన్న ప్రచారంతో జనాలు హడలిపోతున్నారు.
ఇది ఎలా వచ్చిందో కానీ పెద్ద ఎత్తున న్యూస్ వైరస్ అవుతోంది. దీని మీద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గట్టిగానే ఖండిస్తున్నారు. అలాంటిది ఏదీ లేదని, విశాఖలో డెల్టా ప్లస్ కేసు అన్నదే లేదని కూడా వారు చెబుతున్నారు.
ఇదిలా జీవీఎంసీ పరిధిలో డెల్టా ప్లస్ కేసు ఉన్నట్లుగా చెబుతున్నారని, అందువల్ల వైద్య అధికారులు సత్వరం స్పందించాలంటూ తెలుగుతమ్ముళ్ళు అపుడే డిమాండ్ చేయడం మొదలెట్టేశారు.
నిజంగా డెల్టా ప్లస్ విశాఖలో ఉందా లేదా అన్నది తెలియక జనాలు అయితే కలవరపడుతున్నారు. మొత్తానికి వైద్య అధికారులు ఖండించినప్పటికీ విశాఖలో డెల్టా ప్లస్ భయం మాత్రం పెరిగిపోతోంది.