కాంగ్రెస్ పార్టీకి శ్రతువు ఎక్కడో ఉండరు కాంగ్రెస్ పార్టీతో ఉంటూ కాంగ్రెస్ చూట్టే శ్రతువులు ఉంటారు దీనికి కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న పేరు వ్యక్తిగత ప్రజస్వామం. మునుగోడు కాంగ్రెస్ లో గ్రూప్ వార్ మొదలైంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడుగా అయిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూప్ వార్ ఇంకా ఎక్కువయింది.
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కోసం ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజ్ అధ్వర్యంలో గాంధీ భవన్ లో సమావేశం జరగక ముందే సీనియర్ నేత పాల్వాయి స్రవంతి అడియో లీక్ చర్చాంశనీయంగా మారింది. ఒక కార్యకర్తతో స్రవంతి మాట్లడినా ఆడియో కాంగ్రెస్ లో కలకలం రేపుతొంది.
మునుగోడు టికెట్ చల్లమల్ల కృష్ణా రెడ్డికి ప్రతిపాదనను పాల్వాయి వ్యతిరేకిస్తూ.. పరువు నిలబెట్టుకోవాలంటే గెలిచేవారికే టికెట్ ఇవ్వాలంటూ.. టికెట్ విషయంపై గాంధీభవన్ లోనే తెచ్చుకుంటా పాల్వాయి స్రవంతి తేల్చి చెప్పారు.
చండూరు సభ సక్సెల్ నా వల్లే అయ్యింది తప్ప కృష్ణారెడ్డి వల్ల కాదు అని, ఆయనకు టికెట్ ఇస్తే మునుగోడులో కూడా హుజురాబాద్ సీన్ రిపీట్ ఖాయం అంటూ స్రవంతి తేల్చి పడేశారు. కాంగ్రెస్ లో ఈ గ్రూప్ తగాదాల వల్లే కాంగ్రెస్ ఓటమి పాలవుతోంది.
ఇప్పటికి అయిన అందరూ నాయకులు ఏకతాటిపై వచ్చి పార్టీని గెలిపించుకుంటే పార్టీ భవిష్యత్తు ఉంటుంది లేకపోతే పార్టీ దాదాపు ఇంకా కనపడదు.