ఖిలాడీ అంటూ మాంచి భారీ సినిమా చేస్తున్నాడు హీరో రవితేజ. ఆ సినిమా తరువాత కొత్త దర్శకుడు శరత్ ఈ సినిమాను అందిస్తున్నారు.
రవితేజ నటిస్తున్న ఈ 68వ సినిమాకు 'ఎమ్మార్వో' అనే టైటిల్ ను పరిశీలనలో వుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా కనిపిస్తాడని, ఈ సినిమాలో కూడా ఎర్రచందనం రవాణా లాంటి వ్యవహారాలు వుంటాయని తెలుస్తోంది.
పడిపడి లేచె మనసు లాంటి మంచి సినిమాను అందించిన సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఖిలాడీ సినిమా తరువాత వాస్తవానికి నక్కిన త్రినాధరావు సినిమా చేయాల్సి వుంది.
కానీ ఆ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయాల్సి రావడంతో రవితేజ ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ గురవారం నుంచి ప్రారంభం అవుతుంది.