రెండు సినిమాలు చేసాడు. కానీ పెద్దగా ఫలితం దక్కలేదు. కానీ అతగాడి తండ్రి మీద వున్న అభిమానంతో మళ్లీ సినిమా చేతిలోకి వచ్చింది.
మరి ఏ ముహుర్తాన ఆ సినిమా చేతిలో పడిందో, ఇప్పుడు అరడజనకు పైగా సినిమాలు చేతిలో వున్నాయి. ఇదంతా సంతోష్ శోభన్ గురించే. పేపర్ బాయ్ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కొంతకాలం అలా వుండిపోయాడు.
యువి కాన్సెప్ట్స్ సంస్థ ఏక్ మినీ కథ అంటూ ఓ సినిమా స్టార్ట్ చేసింది. ఆ వెంటనే మారుతి డైరక్షన్ లో మంచిరోజులు వచ్చాయి అనే సినిమాను స్టార్ట్ చేసారు.
ఇది కాక మరో సినిమాకు అదే హీరోను లాక్ చేసారు. మరోపక్క స్వప్నదత్ ఓ సినిమా తీసే ప్రయత్నంలో వున్నారు. వీరంతా ఇలా వుంటే మెగాస్టార్ కుమార్తే నిర్మాతగా సంతోష్ శోభన్ తోనే సినిమా తీసే ప్రయత్నంలో వున్నారు.
ఇలా మొత్తం మీద అరడజను సినిమాలు చేతిలో వున్నాయి ఆ యంగ్ హీరోకి. నిఖిల్, రాజ్ తరుణ్ ఇలా ఈ రేంజ్ హీరోలు ఎవ్వరికీ ఇన్ని సినిమాలు చేతిలో లేవు. అది కూడా పెద్ద బ్యానర్లతో. అంతే టైమ్ కలిసి వస్తే అలాగే వుంటుంది.