హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోను అడ్డు పెట్టుకుని వైసీపీని రాజకీయంగా బద్నాం చేయాలని టీడీపీ అవిశ్రాంత ఉద్యమానికి సిద్ధమైంది. న్యూడ్ వీడియో వెలుగులోకి వచ్చి వారం రోజులైంది. దాన్ని పట్టుకుని టీడీపీ ఇంకా వేలాడుతోంది. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి అభ్యంతరకర వీడియోలు దొరికితే ఏం చేయాలో అదే పని టీడీపీ చేస్తోంది. అయితే టీడీపీకి అనుకున్న స్థాయిలో రాజకీయంగా ఇది కలిసి రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మాధవ్ న్యూడ్ వీడియోను అసహ్యించుకుంటున్నట్టే, టీడీపీ నేతల అభ్యంతరకర ప్రచారాన్ని కూడా జనం వ్యతిరేకిస్తున్నారు. పౌర సమాజానికి రాజకీయాలతో పనిలేదు. మంచైతే ఆదరిస్తారు. చెడు అని భావిస్తే తిరస్కరిస్తారు. కానీ రాజకీయ పార్టీల వైఖరి అలా ఉండదు. ప్రత్యర్థుల చెడే కావాలి. మాధవ్ వీడియోకి సంబంధించి ప్రధానంగా టీడీపీ చేసిన తప్పు ఏంటంటే… ఈ విషయమై పార్టీలోని గౌరవప్రదమైన మహిళలు, పురుష నాయకులతో మాట్లాడించకపోవడం.
వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా నాయకులు, అలాగే కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న పురుష నాయకులకు “న్యూడ్” బాధ్యతల్ని అప్పగించడంతో… “అందరూ అంతే” అనే ఏహ్య భావన ప్రజల్లో కలుగుతోంది. “వీళ్లేం తక్కువ తినలేదులే” అని జనం అనుకునే పరిస్థితి.
మాధవ్ వ్యవహారాల్ని చీల్చి చెండాడుతూనే, మరోవైపు ఇలాంటి వీడియోలు కావాలి అనే రీతిలో టీడీపీ నేతల ప్రవర్తన ఉందనే విమర్శ వెల్లువెత్తుతోంది. మాధవ్ ఎంత తప్పు చేశాడో, దాన్ని ఊరూరా సినిమా చూపిస్తున్నట్టు ప్రదర్శిస్తున్న టీడీపీ ఏం కోరుకుంటోందనే ప్రశ్నలొస్తున్నాయి. పోనీ ఈ వ్యవహారంపై విస్తృత ప్రచారం చేస్తున్న నాయకులేమైనా పతివ్రతలా? అనే ప్రశ్న వస్తోంది.
కాస్త గౌరవప్రదమైన నడవడిక ఉన్న టీడీపీ నేతలు మాధవ్ ఉదంతాన్ని నెత్తికెత్తుకుని విమర్శలు చేసి వుంటే వైసీపీ బాగా ఇరకాటంలో పడేది. కానీ మాధవ్ దొరికిన కామ పిశాచి అయితే, దొరకని పతివ్రతలు వాళ్లంటూ వీర ఉద్యమ టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. అందుకే ఏదైనా అంశంపై పోరాడే వాళ్లను బట్టి గౌరవం వుంటుందని పెద్దలు చెప్పడం. మాధవ్ ఎపిసోడ్లో టీడీపీ ఫెయిల్ కావడానికి వారు ఎంచుకున్న నేతలే కారణమని చెప్పక తప్పదు.