సతీ సహగమనం ఒప్పుకుందామా… ?

ఒకపుడు ఈ దేశంలో ఎన్నో ఆచారాలు, వ్యవహారాలూ ఉండేవి. మరి వాటిని కాలగమనంలో అంతా వద్దు అనుకున్నారు. ఆధునిక జీవన విధానంలో అవి అసలు కుదరవు అని తేల్చేశారు. Advertisement మరి మాన్సాస్ ట్రస్ట్…

ఒకపుడు ఈ దేశంలో ఎన్నో ఆచారాలు, వ్యవహారాలూ ఉండేవి. మరి వాటిని కాలగమనంలో అంతా వద్దు అనుకున్నారు. ఆధునిక జీవన విధానంలో అవి అసలు కుదరవు అని తేల్చేశారు.

మరి మాన్సాస్ ట్రస్ట్ లో మాత్రం ఇంకా లింగ వివక్ష కొనసాగుతోందా. అక్కడ కేవలం పురుషులు మాత్రమే చైర్మన్లు కావాలా. ఎపుడో రూపొందించిన బైలాస్ లో మహిళలను చులకనగా చూసాయా. ఇలాంటి వాటి మీద పోరాడాల్సిందే అంటున్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.

సతీసహగనం ఆనాడు ఎంత తప్పో ఇపుడు లింగ వివక్ష కూడా అంతే తప్పు అని ఆమె అంటున్నారు. కేవలం మహిళ అన్న కారణం చేత సంచయిత ఆ పదవికి ఎలా అర్హురాలు కాకుండా పోతారో అశోక్ గజపతిరాజు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 

మాన్సాస్ పీఠం పైన మహిళలు కూర్చోవద్దు అంటూ ఆ రోజులలో ఒక రాజు తీర్మానిస్తే అది ఎప్పటికీ శిలాశాసనం అవుతుందా అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో జగన్ ప్రభుత్వంలో యాభై శాతం పదవులు మహిళలకే కట్టబెడుతున్నారని, వారిని అన్ని విధాలుగా ముందుకు తీసుకువస్తున్నారని ఆమె అన్నారు ఈ వివక్షపైన తాము గట్టిగా పోరాడుతామని అన్నారు. 

విశాఖ వచ్చిన ఆమె మాన్సాస్ మాజీ చైర్ పర్సన్ సంచయితను కలసి ఆమెతో అన్ని విషయాలు చర్చించారు. మొత్తానికి మాన్సాస్ వ్యవహరం వేరే మలుపు తిరిగేలా ఉంది.