ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, ఎల్లో మీడియాకి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇది స్వీట్ వార్నింగ్ కాదు, నిజంగానే హాట్ వార్నింగ్. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై దుష్ప్రచారం చేసే మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు వైఎస్ జగన్. ఈ విషయంలో వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుని ఆదర్శంగా తీసుకున్నట్లే కన్పిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో మీడియా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చంద్రబాబుకీ, తెలుగుదేశం పార్టీకీ ఎన్నో ఏళ్ళుగా బాకా ఊదుతున్నాయి సదరు మీడియా సంస్థలు. టీడీపీ ముసుగేసుకొస్తే, ఆయా మీడియా సంస్థల గురించి ఇంతలా మాట్లాడుకోవాల్సిన అవసరం వుండదనుకోండి.. అది వేరే విషయం. వైఎస్ జగన్మోహన్రెడ్డికీ సాక్షి మీడియా సంస్థ వుంది. కానీ, ఆ 'ఎల్లో' మీడియా స్థాయిలో ఇంకే ఇతర మీడియా సంస్థ కూడా దిగజారే పరిస్థితి లేదన్నది నిర్వివాదాంశం.
మొత్తమ్మీద, వైఎస్ జగన్ హెచ్చరికతో సదరు మీడియా సంస్థల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. ఐదేళ్ళపాటు, పచ్చ మీడియాని అడ్డంపెట్టుకుని నిస్సిగ్గుగా రాజకీయం చేయొచ్చుననీ, వైఎస్ జగన్ ప్రభుత్వంపై చెలరేగిపోవచ్చనీ బోల్డన్ని ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి వైఎస్ జగన్ హెచ్చరికతో మైండ్ బ్లాంక్ అయిపోయి వుండొచ్చు.
అవినీతికి కారణమవుతున్న కాంట్రాక్టుల రద్దు సహా అనేక కీలకమైన విషయాలకు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవ వేదిక నుంచే స్పష్టంచేసిన వైఎస్ జగన్, ఈ క్రమంలో 'ఎల్లో మీడియా నుంచి రాబోయే అర్థంపర్థం లేని థ్రెట్'కి ముందస్తుగానే షాకిచ్చారన్నమాట.
మరి, ఈ వార్నింగ్‌కి సదరు మీడియా సంస్థలు తలొగ్గుతాయా.? చంద్రబాబు భజనలో తరించాలి కాబట్టి, జగన్ పాలనని తక్కువ చేసి చూపించడం వైపే మొగ్గుచూపి, చీవాట్లు తింటాయా.? వేచి చూడాల్సిందే.
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఫొటోస్ కోసం క్లిక్ చేయండి