మహేష్ సర్ప్రయిజ్ ఇదే

ఈరాత్రి 12 గంటలు సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఆయన టీమ్ పీర్వో ట్వీట్. దాంతో అదేంటో అని ఫ్యాన్స్ ఆసక్తి. అదేంటీ అంటే.. Advertisement ఈరాత్రి 12 గంటలకు మహేష్ బాబు…

ఈరాత్రి 12 గంటలు సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఆయన టీమ్ పీర్వో ట్వీట్. దాంతో అదేంటో అని ఫ్యాన్స్ ఆసక్తి. అదేంటీ అంటే..

ఈరాత్రి 12 గంటలకు మహేష్ బాబు 26వ సినిమా టైటిల్, లోగో రెండూ అనౌన్స ఛేస్తారు. మాస్ ఎంటర్ టైనర్ అనిల్ రావిపూడి డైరక్షన్ లో మహేష్ చేయబోయే సినిమాకు 'సరిలేరు నీకెవ్వరూ' అనే టైటిల్ ఫిక్స్ చేసారని ముందే వెల్లడించాం. ఇప్పుడు ఆ టైటిల్ లోగోను బయటకు విడుదల చేస్తారు. అంతే కాకుండా మహేష్ బాబు తండ్రి కృష్ణ మీద తయారు చేసిన విడియో బైట్ కూడా వదులుతారని తెలుస్తోంది. 

మిగిలిన టాప్ డైరక్టర్లకు అనిల్ రావిపూడికి తేడా వుంది. అనిల్ పని చాలా స్పీడ్ గా వుంటుంది. అందుకే అప్పుడే లోగో అందిస్తున్నారు. అలాగే రేపు ఉదయం షూటింగ్ స్టార్ట్ చేస్తూనే సంక్రాంతి విడుదల అని ప్రకటించేస్తారు. రెగ్యులర్ షూట్ జూన్ నుంచి వుంటుంది. 

రష్మిక మడొన్న, విజయశాంతి, జగపతి బాబు, బండ్ల గణేష్ ఇప్పటికి డిసైడ్ అయిన తారాగణం. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం. అనిల్ సుంకర, దిల్ రాజు నిర్మాతలు, మహర్షి సినిమా మాదిరిగానే అరడజను మంది పీఆర్వోలు ఈ సినిమాకు వర్క్ చేస్తారు.

బిఎ రాజు, విశ్వ, వంశీ, శేఖర్, వంశీ కాకా, నాని లాంటి లీడింగ్ పీర్వోలు అందరూ ఈ సినిమాకు వర్క్ చేస్తారు. మహర్షికి ఇలాగే వర్క్ చేయడం వల్ల ఎక్కడా నెగిటివ్ పెద్దగా రాకుండా చూడగలిగారు. పైగా చాలా ఎక్కువ పబ్లిసిటీ జరిగింది. అందుకే మళ్లీ అదే స్కీమ్ రన్ చేస్తున్నారని టాక్. 

జగన్ పదేళ్ల రాజకీయ ప్రస్థానం అద్భుత మలుపు

కమ్మ వారి ఆత్మ ఘోష… ఆడియో కాల్..ఇంతగానా?