ఓటమి ఒప్పుకున్న హీరో

ఓటమి అంగీకరించడం అంత సులువు కాదు. అందులోనూ ఫాల్స్ ప్రెస్టీజ్ లు, ఫ్యాన్స్, ఇంకా చాలా వ్యవహారాలు నిండిన హీరోల వ్యవహారంలో మరీ కష్టం. అల్లు వారి ఫ్యామిలీ నుంచి హీరోగా నిలదొక్కుకోవాలని కిందా…

ఓటమి అంగీకరించడం అంత సులువు కాదు. అందులోనూ ఫాల్స్ ప్రెస్టీజ్ లు, ఫ్యాన్స్, ఇంకా చాలా వ్యవహారాలు నిండిన హీరోల వ్యవహారంలో మరీ కష్టం. అల్లు వారి ఫ్యామిలీ నుంచి హీరోగా నిలదొక్కుకోవాలని కిందా మీదా అవుతున్న అల్లు శిరీష్ లేటెస్ట్ సినిమా ఎబిసిడి. ఈ సినిమా ఆశించన మేరకు విజయం సాధించలేదు. 

అయితే విషయం ఏమిటంటే, పుట్టిన రోజు పూటా ఇది చేస్తా అది చేస్తా అని చెప్పకుండా, ఎబిసిడి సినిమా విజయంపై ఆశపెట్టుకున్నా అని, కానీ ఆశించన మేరకు విజయం సాధించలేదని అంగీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అల్లు శిరీష్. అంతే కాదు, సరైన విజయం, సరైన ట్రాక్ లో పడే వరకు కష్టపడి ప్రయత్నిస్తూనే వుంటానని చెప్పేసాడు.

మంచిదే, ఓటమి ఒప్పుకుని, కష్టపడి విజయం సాధిస్తా ఎలాగైనా అని ఆత్మవిశ్వాసం వుండడం. కానీ ఒకటే పాయింట్. తండ్రి అల్లు అరవింద్ మంచి నిర్మాత. డిస్ట్రిబ్యూటర్, టాలీవుడ్ లో కింగ్ అనుకోవాలి. మరి ఆయన వారసత్వం అందుకోవాలని, మంచి నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, బయ్యర్ గా మారాలని ఎందుకు అనిపించడం లేదో అల్లు శిరీష్ కు.