బీహార్ సీఎం రాజీనామా!

బీహార్‌లో జేడీ(యూ), బీజేపీల మధ్య పొత్తుకు స్వస్తి పలికిన నితీశ్ కుమార్ మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఫగూ చౌహాన్‌ కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. Advertisement…

బీహార్‌లో జేడీ(యూ), బీజేపీల మధ్య పొత్తుకు స్వస్తి పలికిన నితీశ్ కుమార్ మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఫగూ చౌహాన్‌ కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.

సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత నితీష్ కుమార్ ప్ర‌తిప‌క్ష నేత తేజ‌స్వి యాద‌వ్ ను క‌లిశారు. ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. కొత్త ప్ర‌భుత్వంలో కూడా నితీష్ నే సీఎంగా ఉండ‌బోతున్నట్లు స‌మాచారం.

ఆర్జేడీ, జేడీయూ కూట‌మిలోకి కాంగ్రెస్ కూడా చేరేందుకు సిద్ధమైంది. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చిరకాల ప్రత్యర్థిగా చూడాలనే తన ఆశను ఇప్పుడు నితీష్ పునరుద్ధరించుకునే ప్రయత్నం చేయవచ్చు. 

నితీష్ కుమార్ ఒకసారి ఎన్డీఏ నుండి బయటకు వచ్చి, 2024లో కాంగ్రెస్ పెద్దగా రాణించకపోతే ప్రధానమంత్రి అభ్యర్థులలో ఒకరిగా అవతరిస్తారనే సిద్ధాంతం కూడా ఉంది.