త్రినాథరావు కూర్చుంటే ప్రసన్న డైరక్షన్ చేస్తాడా?

త్రినాథరావు నక్కిన, బెజవాడ ప్రసన్నకుమార్ ది హిట్ కాంబినేషన్. ప్రసన్న కథ-మాటలు రాస్తే, దాన్ని త్రినాధరావు తెరకెక్కిస్తాడు. సరిగ్గా ఇక్కడే ఓ పుకారు కూడా చాన్నాళ్లుగా ఉంది. త్రినాధరావు జస్ట్ అలా పర్యవేక్షిస్తుంటాడని, దర్శకత్వంతో…

త్రినాథరావు నక్కిన, బెజవాడ ప్రసన్నకుమార్ ది హిట్ కాంబినేషన్. ప్రసన్న కథ-మాటలు రాస్తే, దాన్ని త్రినాధరావు తెరకెక్కిస్తాడు. సరిగ్గా ఇక్కడే ఓ పుకారు కూడా చాన్నాళ్లుగా ఉంది. త్రినాధరావు జస్ట్ అలా పర్యవేక్షిస్తుంటాడని, దర్శకత్వంతో పాటు అన్నీ ప్రసన్నకుమార్ చూసుకుంటాడనే రూమర్ ఉంది. దీనిపై ఉన్నదున్నట్టుగా స్పందించాడు నక్కిన.

ప్రసన్నకుమార్ వర్క్ కేవలం కథ, మాటల వరకేనని క్లారిటీ ఇచ్చాడు త్రినాధరావు. అయితే ప్రసన్న రాసే డైలాగ్స్ లో కృష్ణా జిల్లా యాస ఉంటుందని, ఎలా పలకాలో ప్రసన్న చెబితేనే బాగుంటుందనే ఉద్దేశంతో అతడ్ని సెట్స్ కి రమ్మంటానని తెలిపాడు త్రినాధరావు. అంతే తప్ప దర్శకత్వానికి, ప్రసన్నకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు.

ప్రసన్నను డైరక్షన్ చేయమని తనే ప్రోత్సహించానని, 2-3 సార్లు ప్రయత్నించి, ఇంకా బాగా నలగాలంటూ తన దగ్గరకు తిరిగి వచ్చేశాడని తెలిపాడు త్రినాధరావు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న వెంకటేశ్, రవితేజ సినిమాలపై కూడా స్పందించాడు.

“హలో గురు ప్రేమకోసమే తర్వాత గ్యాప్ వచ్చిన మాట నిజమే. వెంకటేష్ తో సినిమా చేద్దాం అని గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఆ స్క్రిప్ట్ చాలా టైమ్ తీసుకుంది. ఆ తర్వాత కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది. దీంతో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత వెంకటేష్ గారు నారప్ప స్టార్ట్ చేశారు. నాకేమో రవితేజ సినిమా ఆఫర్ వచ్చింది. అది పూర్తిచేసి వెంకీ ప్రాజెక్టు పైకి వెళ్దాం అనుకున్నాను. రవితేజ స్క్రిప్ట్ స్టార్ట్ చేసే టైమ్ కు మళ్లీ సెకెండ్ వేవ్ వచ్చింది.”

ప్రస్తుతానికైతే రవితేజ సినిమాకు సంబంధించి టోటల్ స్క్రిప్ట్ రెడీ అయిందని, షూటింగ్ కు సిద్ధంగా ఉన్నానని తెలిపిన నక్కిన.. వెంకీ సినిమాకు సంబంధించి మాత్రం క్లైమాక్స్ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయని అన్నాడు.

లాక్ డౌన్ లో 3 స్క్రిప్టులు రెడీ చేసుకున్నాడట ఈ దర్శకుడు. రవితేజ సినిమా పూర్తయిన వెంటనే ఆ స్క్రిప్టుల్ని బ్యాక్ టు బ్యాక్ సెట్స్ పైకి తీసుకొస్తాడట.