చంద్రబాబు అంతే.. ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే, దాని క్రెడిట్ మొత్తం లాగేసుకోవడానికి అస్సలు సిగ్గుపడరు. అవసరమైతే అలా క్రెడిట్ లాగేసుకోవడానికి తన మీడియా సహకారం కూడా తీసుకుంటారు. సత్య నాదెళ్లను తనే మైక్రోసాఫ్ట్ సీఈవోను చేశానని, అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేశానని, సెల్ ఫోన్ ను తనే తీసుకొచ్చానని.. నోటికొచ్చినట్టు వాగిన చంద్రబాబు, ఇప్పుడు కరోనాను కూడా వదల్లేదు.
కరోనా వస్తుందని రాష్ట్రంలో చెప్పిన మొదటి వ్యక్తి చంద్రబాబు అంట. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, ముఖానికి మాస్క్ వేసుకోవాలని ముందు చంద్రబాబే చెప్పారట. ఆయన ఇంకేమన్నారో చూద్దాం.
“నేను టెలీకాన్ఫరెన్స్ లు పెట్టాను. మేధావులు, డాక్టర్లతో మాట్లాడాను. అప్పటికి వ్యాక్సిన్ రాలేదు. పరిశోధనలు జరుగుతున్నాయి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని మొదటిసారి నేనే చెప్పాను. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అప్పుడే నేను చాలా స్పష్టంగా చెప్పాను. కానీ ముఖ్యమంత్రి నేను చెప్పింది అర్థం చేసుకోలేదు. నేను ముందుజాగ్రత్తలు చెబితే అవహేళన చేశారు.”
చూశారుగా.. ఇలా కరోనాను కూడా తన క్రెడిట్ లో వేసుకున్నారు చంద్రబాబు. కరోనాకు అప్పటికీ ఇప్పటికీ ప్రాధమికంగా ఇచ్చే మందు పారాసెట్మాల్ మాత్రమే. ఆ విషయాన్ని ముందుగా జగన్ చెబితే అవహేళన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా కరోనా ముందుజాగ్రత్త చర్యల్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం
చేశారు.
కరోనా కు తప్పుడు కేసులకు సంబంధం ఏంటి..
రాష్ట్రంలో చంద్రబాబుపై, టీడీపీ నేతలపై పెట్టిన కేసులకు, కరోనాకు ఏమైనా సంబంధం ఉందా? అస్సలు సంబంధం లేని ఈ రెండు అంశాలకు ముడిపెట్టడం చంద్రబాబుకే చెల్లింది.
“వేవ్ వన్ వచ్చింది. వేవ్-2 కూడా వస్తోందని చాలామంది చెప్పారు. రాష్ట్రంలో ముందు నేనే చెప్పాను. నా మాట వినలేదు. కరోనాను ఎదుర్కోండి, ప్రజల గురించి ఆలోచించండి. వైద్యారోగ్యాన్ని మెరుగుపరచండి అని పదే పదే చెప్పాను. అలా చెప్పినందుకు నాపైన తప్పుడు కేసులు పెట్టారు.” అంటూ తలాతోక లేని విధంగా మాట్లాడారు.
సాధన దీక్ష అంటూ హంగామా చేసిన చంద్రబాబు.. దేశం కరోనా థర్డ్ వేవ్ నివారణ కోసం సన్నద్ధమౌతున్న వేళ.. కరోనా ఎలా వస్తుందో చెబుతూ 'తుంపర్ల' నుంచి మొదలుపెట్టి విసిగించారు.