తప్పును ఎవ్వరూ సమర్ధించకూడదు

ప్రభుత్వం మీద కోపం వుండొచ్చు. పార్టీ కిట్టకపోవచచ్చు. కానీ అందుకోసం అని తప్పు చేసిన వారిని సమర్థించడం సబబు అనుకోవద్దు. పొరపాటు అని చెప్పండి తప్పు లేదు. కానీ ప్రభుత్వం మీద బురద వేయడం…

ప్రభుత్వం మీద కోపం వుండొచ్చు. పార్టీ కిట్టకపోవచచ్చు. కానీ అందుకోసం అని తప్పు చేసిన వారిని సమర్థించడం సబబు అనుకోవద్దు. పొరపాటు అని చెప్పండి తప్పు లేదు. కానీ ప్రభుత్వం మీద బురద వేయడం కోసం తప్పు ను సమర్థించకూడదు. విజయవాడ బస్ స్టాండ్ లో ప్రమాదం జరిగింది. నిజానికి పొరపాటున జరిగిన ప్రమాదం అది. ఆ పొరపాటు ఏమిటి?

ఆటోమెటిక్ బస్ రివర్స్ మోడ్‌లో వుందనుకుని, అక్స్ లేటర్ మీద ప్రెజర్ ఇచ్చారు. అది హై ఎండ్ బస్ కనుక వెంటనే పికప్ తీసేసుకుని ప్లాట్ ఫారమ్ మీదకు వెళ్లిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకెండ్ లో బ్రేక్ నొక్కాలి. అది జరగలేదు. నిజానికి డ్రైవ్ మోడ్‌లో వుందో, రివర్స్ మోడ్ లో వుందో చూసుకోలేదు. అది పొరపాటు.

ఆటోమెటిక్ వెహికల్ వాడేవారికి ఇలాంటి సమస్య చిన్నగా ఒకటి రెండుసార్లు ఎదురయ్యే వుంటుంది. అందుకే ఆటోమెటిక్ వెహికిల్ దగ్గర అలెర్ట్ గా వుండాలి. ఏ మోడ్ లో వుందో చూసుకుంటూ వుండాలి.

కానీ ఆ విషయం కూడా చెబుతూనే, ఇంక కొద్ది నెలలు సర్వీస్ వుండగానే ఆటో మెటిక్ వెహికల్ ఇచ్చారు అని ఒక కారణం చెబుతారు. ఆటోమెటిక్ వెహికిల్ నడపలేను అని చెబితే పీక తీసేస్తారు.. ఉద్యోగం తీసేస్తారా?

అక్సిలేటర్ పట్టేస్తోంది. కంప్లయింట్ బుక్ లో రాసినా రిపేరు చేయలేదు అని మరో కారణం చెబుతారు. ఆక్సిలేటర్ పట్టేస్తే ప్రమాదం అని తెలుసు కదా.. బస్ తీయను అని మొండికేయాల్సిన బాధ్యత డ్రైవ‌ర్‌ ది కాదా. అలా తీస్తే తన ప్రాణంతో పాటు, జనాల ప్రాణాలకు కూడా ప్రమాదం అని తెలియదా? తెలిసి కూడా ఎందుకు రాజీ పడ్డారు?

పై రెండు కారణాల్లోనూ ఆర్టీసీ యూనియన్ నాయకులు డ్రైవ‌ర్‌కు అండగా వుంటారు కదా. బస్ తీయనని చెబితే పనిష్ మెంట్ ఇస్తే యూనియన్ నాయకులు ఊరుకుంటారా?

కేవలం ప్రభుత్వం మీద కోపంతో తప్పు చేసిన అధికారులను, ఉద్యోగులను వెనకేసుకు వస్తే, ఇంకా ధీమా పెరిగిపోతుంది. కావాలంటే గమనించండి. గత నాలుగేళ్ల కాలంలో రోడ్లు బాగాలేవు అన్న వార్తలు చూసి వుంటారు. అంతే తప్ప, ఆ రోడ్ ఎప్పుడు వేసారు. ఎంత ఖర్చు చేసి వేసారు. ఎన్నాళ్లలో అది మళ్లీ ఆ స్టేజ్ కు వచ్చింది అన్నది మాత్రం వుండదు. ఎందుకంటే ఇలా రాయలంటే అన్ని డిటైల్స్ సేకరించాలి. కానీ అందులో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కుదరదు. అదే కనుక జస్ట్ రోడ్ బాలేదు.. ప్రభుత్వ నిర్వాకం అంటే పనైపోతుంది.

ప్రస్తుతం ఇదే ట్రెండ్ అయిపోయింది. ఏమీ చేయలేం.. ఏ మీడియా దీనికి మినహాయింపు కాదు.