తెలంగాణ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు!

మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్య‌క్షుడు, 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభవజ్ఞుడు అయిన చంద్ర‌బాబు మ‌ళ్లీ తెలంగాణ రాజ‌కీయాల్లో వేలు పెడుతున్నాడా అంటే తాజా రాజ‌కీయ ప‌రిస్ధితులు చూస్తుంటే నిజ‌మే అనుకునేలా ఉంది. తాజాగా…

మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్య‌క్షుడు, 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభవజ్ఞుడు అయిన చంద్ర‌బాబు మ‌ళ్లీ తెలంగాణ రాజ‌కీయాల్లో వేలు పెడుతున్నాడా అంటే తాజా రాజ‌కీయ ప‌రిస్ధితులు చూస్తుంటే నిజ‌మే అనుకునేలా ఉంది. తాజాగా చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న అనంత‌రం ఈ ఉహాగానాలు మ‌రింత‌ ఎక్కువ అయ్యాయి.

ఉమ్మ‌డి అంధ్ర‌ప్ర‌దేశ్ లో టీడీపీ ప్ర‌భావం తెలంగాణ‌లో బాగానే ఉండేది. అలాగే తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత‌ కూడా కొన్ని ఎమ్మెల్యే సీట్లు, ఓటు బ్యాంక్ సంపాదించుకున్నారు. రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు తెలంగాణ‌లో ఒక ఎమ్మెల్సీని కొనాల‌ని చూసి అడ్డంగా బుక్ అయ్యి కేసీఆర్ కు భ‌య‌ప‌డి రాత్రికి రాత్రే చంద్ర‌బాబు త‌న మకాం అమ‌రావతికి మార్చుకున్నారు. ఇంకా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్ట‌నని చెప్పి.. తీరా చూస్తే 2018 తెలంగాణ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌హ కూట‌మితో జ‌త‌ క‌ట్టి ఘోరంగా ఓడిపోయి, కాస్తో కూస్తో కాంగ్రెస్ కు ఉన్న ఓట్లు కూడా లేకుండా చేసిన ఘ‌న‌త కూడా చంద్ర‌బాబుకే ద‌క్కుతుంది.

మ‌హా కూట‌మి ఘోర ఓట‌మి త‌ర్వాత‌ తెలంగాణ‌లో టీడీపీ ప్ర‌భావం అస‌లు క‌న‌ప‌డ‌డం లేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడు అయిన వెంట‌నే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల‌ల్లో కొంత మంది నాయకులు.. కాంగ్రెస్ ను చంద్ర‌బాబు లీజ్ కు తీసుకుని దానికి రేవంత్ రెడ్డిని అధ్య‌క్షుడిగా చేశార‌ని విమ‌ర్శించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోతూ కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి పీసీసీ ప‌ద‌విని కొనుకున్నారని దాని వెనుక చంద్ర‌బాబు ఉన్నారు అని విమ‌ర్శించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్ధి కాదు అని సీఎం అంటే చంద్ర‌బాబు మ‌నిషి అని కొత్త ఆర్ధం చెప్పారు.

తాజాగా అంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చంద్ర‌బాబు ఢిల్లీలో చేసిన క‌ప‌ట‌ రాజ‌కీయాన్ని వెలుగులోకి తీసుకువ‌చ్చారు. ఆయ‌న మాట్లాడుతూ క్విడ్ ప్రోకో త‌ర‌హా రాజ‌కీయం చంద్ర‌బాబు నాయుడు చేస్తున్నారు అని మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు.

చంద్ర‌బాబు త‌న‌ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి కొత్త త‌ర‌హా ప్ర‌తిపాద‌న ఇచ్చారంటూ.. మాకు ఆంధ్ర‌లో మీరు స‌పోర్ట్ చేస్తే.. మీకు తెలంగాణ‌లో బీజేపీ గెలుపు కోసం స‌హాయం చేస్తారంటా కొత్త త‌ర‌హా ప్రతిపాదన మోదీ ముందుకు తెచ్చార‌ని అంటున్నారు. తెలంగాణ‌లో ఇప్ప‌టికీ కూడా కాస్తా కూస్తో ఓటు బ్యాంక్ టీడీపీకి ఉన్న‌ది నిజం. కాని చంద్రబాబు త‌న శిష్యుడు రేవంత్ కు కాకుండా బీజేపీకి స‌హాయ స‌హాకారాలు ఇస్తారా అన్న‌దే ఇక్క‌డ విష‌యం. కానీ చంద్ర‌బాబు రాజకీయం చూసిన వారు మాత్రం త‌న ప‌ద‌వి కోసం చంద్ర‌బాబు ఎంత‌కైనా తెగించే లాగా ఉంటారనేది న‌గ్న‌స‌త్యం.

చంద్ర‌బాబుకు ఈ త‌ర‌హా రాజ‌కీయాలు కొత్త‌వి కావు కాక‌పోతే తెలంగాణ‌లో మ‌ళ్ళీ రాజ‌కీయం చేస్తే అది కాస్తా కేసీఆర్ కు అనుకూలిస్తే మాత్రం అంతే సంగ‌తులు.