జగన్ పై ఎందుకింత క‌క్ష‌?

వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం హోదాలో ఉన్నంత వరకూ ఆయన తనయుడు వైఎస్ జగన్ చుట్టూ ఉండిందంతా కమ్మ వాళ్లే! సీఎం తనయుడిగా తెర వెనుక ఉండిన జగన్‌తో వ్యాపార సంబంధాలు కలిగిన కమ్మ…

వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం హోదాలో ఉన్నంత వరకూ ఆయన తనయుడు వైఎస్ జగన్ చుట్టూ ఉండిందంతా కమ్మ వాళ్లే! సీఎం తనయుడిగా తెర వెనుక ఉండిన జగన్‌తో వ్యాపార సంబంధాలు కలిగిన కమ్మ వాళ్ల జాబితా చాలా పెద్దదే! జగన్ అంటే నాటి కాంగ్రెస్ నేతల్లో ఉండిన క్రేజ్ అంతా ఇంతా కాదు. 2009లో తొలిసారి ఎంపీగా నెగ్గి ఢిల్లీకి వెళ్లినప్పుడు నాటి ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ ఎంపీలు జగన్ పక్కన నిలబడానికి తోపులాడుతున్నారని వాళ్లని ఢిల్లీ జర్నలిస్టులు కథనాలు రాశారు అప్పట్లో. అలా తోపులాడిన వాళ్లలో అప్పుడు, ఇప్పు డు కమ్మ సామాజికవర్గం ప్రముఖులుగా చలామణి అవు తున్న వాళ్లున్నారు. అలాంటి కమ్మవాళ్లు ఇప్పుడు ఎక్కడకు వచ్చారంటే… సీఎం ెదాలో ఉన్న వ్యక్తి అంతు చూస్తా మనేంత వరకూ! 

ఎందుకింత మార్పు? జగన్ వ్యాపార సంస్థల్లో పెట్టుబ డులు పెట్టడానికి కూడా పోటీ పడిన కమ్మ వాళ్లు, ఇప్పుడు ఎందుకింత అసహనంతో కాగిపోతున్నారు? వైఎస్ జగన్ గతంలోలా తమతో ఉండటం లేదనా? తమను కలుపుకో లేదనా! వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో బాగా లాభపడిన వాళ్లలో కమ్మవాళ్లే ముందున్నారు. ఆర్థికంగా, వ్యాపారాల పరంగా, ఇంకా చెప్పాలంటే వాళ్లు చేసిన నేరాల నుంచి కూడా సులువుగా బయటపడ్డారు!

నటుడు బాలకష్ణ ఇంట్లో కాల్పుల వ్యవహారం చాలు.. కమ్మ వాళ్ల విషయంలో వైఎస్ ఎంత బ్రాడ్ మైండెడ్‌తో వ్యవహరించారో చెప్పడానికి! ఎన్టీఆర్ తనయుడిని అప్పుడే జైలుకు పంపి, ఊచలు లెక్క పెట్టిచ్చి ఉంటే.. కమ్మ వాళ్లకు ఇప్పుడు వెక్కిరించడానికి మిగిలేది ఏమీ కాదేమో! ఎన్టీఆర్ తనయుడి విషయంలో జరిగిన వ్యవహారం ఏదైనా.. వైఎస్ చూసీచూడనట్టుగా వ్యవహరించారు. ఒకవేళ జగన్ మీద కమ్మ వాళ్లు వెల్లగేక్కంత అక్కసులో వందో వంతు వైఎస్‌లో ఉండి ఉంటే.. బాలకష్ణ కథ మరోలా ఉండేదేమో!

ప్రతి కథలోనూ గ్రహిస్తే ఒక నీతి ఉంటుంది. తన తండ్రి పాలన నుంచి కూడా జగన్ చాలా నీతిని గ్రహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన హవా బాగా సాగినప్పుడు కూడా తన ప్రత్యర్థులను పాతాళానికి తొక్కేయాలని, తనపై బురద జల్లే వాళ్లను ఉపేక్షించకూడదని అనుకోలేదు. అదే పెద్ద పొరపాటు అయ్యింది. ఆ తర్వాతి కాలంలో ఆయన కుటుంబాన్ని అర్ధరాత్రి పూట నడివీధిలో కూర్చుని ఏడ్చేంత వరకూ తీసుకు వచ్చింది వైఎస్ సహదయత!

ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోగలిగింది, చేసుకున్నది నిస్సందేహంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే! అలాగని ఇప్పుడు కూడా జగన్ ఏదో వాళ్లను తొక్కేస్తున్నారని కాదు. కాస్త కొరడా ఝలిపిస్తున్నారు. ఈ మాత్రం దానికే ఆ సామాజికవర్గం ప్రముఖులు తట్టుకోలేక పోతున్నారు. అక్కసు కూతలు మొదలుపెట్టారు. అసహనంతో రగిలిపోతున్నారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోని శిఖండి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని జగన్ మీద వారు పన్నిన కుట్రలు తరహావి ఇప్పుడు జగన్ అమలు చేస్తే వీళ్లు ఏమవుతారో! అనేది శేష ప్రశ్న.

కాసేపేమో జగన్ ‘రెడ్డి’ కాదన్నారు, ఇప్పుడేమో జగన్ రెడ్డి అని అంటున్నారు! ఇంతకీ వీళ్ల బాధ ఏమిటి? జగన్ హయాంలో రెడ్లకు ప్రాధాన్యత దక్కుతోందని, కమ్మ వాళ్లను తొక్కేస్తు న్నారని తెగ ఫీలయిపోతున్నారు. అయినా జగన్ కేబినెట్లో బెర్తులు దక్కింది కేవలం నలుగు రంటే నలుగురు రెడ్లకు! అక్కడే జగన్ తన సొంత సామాజికవర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో తేలిపోయింది. అయినా జగన్‌ది రెడ్డి సర్కారు అని నిరూపించడానికి కమ్మ బ్యాచ్ పడుతున్న తపన అంతా ఇంతా కాదు. మధ్యలో పవన్ కల్యాణ్ ను లేపుతారు, అతడేమో పనిగట్టుకుని, మిస్టర్ జగన్ రెడ్డీ అని సంబోధిస్తారు. దేశం అనుకూల మీడియా కూడా జగన్ ను పదే పదే రెడ్డి అని గుర్తుచేసే ప్రయత్నం చేస్తుంటుంది. 

కానీ వీళ్లు గ్రహించాల్సింది ఏమిటంటే.. కమ్మ వాళ్ల బాధ అందరి బాధా కాదు! కమ్మ వాళ్ల బాధ కేవలం కమ్మ వాళ్ల బాధ మాత్రమే. జగన్ కేబినెట్లో బీసీలకు, ఇతర సామాజికవర్గాలకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. తనకు బాసటగా నిలిచిన కమ్మ వాళ్లకూ జగన్ ఇప్పుడు కూడా ప్రాధాన్యతను ఇచ్చారు. వాళ్లు తమ కులానికి జగన్ నుంచి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని అసెంబ్లీ సాక్షిగా విడమరిచి చెప్పారు. అయితే చంద్రబాబు భజంత్రీ బ్యాచ్ మాత్రం తమను తాము కమ్మ సామాజికవర్గం రక్షకులుగా చెప్పుకుంటూ జగన్ మీద కుల బురదను జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సామాన్య కమ్మ జనాలు చంద్రబాబు హయాంలో కన్నా, ఇప్పుడే హ్యాపీ గా ఉన్నారు. అయితే చంద్రబాబు చంచాగిరి నేతలు మాత్రం తామే కమ్మ వాళ్లు అయినట్టుగా, తమ బాధ అందరి బాధగా తీసుకోవాలన్నట్టుగా వాపోతున్నారు! ఇలాంటి కమ్మ ప్రముఖులపై తనకున్న వైరుధ్యాల్ని దాచుకునే ప్రయత్నం అస్సలు చేయరు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి!

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ యుద్దం రెండు కులాల మధ్య అన్న క్లారిటీ జనాలకు వచ్చేసింది. ప్రధాన మీడియాలో అధిక భాగం జగన్‌ను, జగన్ ప్రభుత్వాన్ని నానా యాగీ చేయడం వెనుక ఈ కులాల కుంపటే కారణం అన్న అవగాహన కూడా జనానికి పూర్తిగా వచ్చేసింది. అందుకే ఆ మీడియా రాతలు నమ్మేస్థితిలోలేరు. నమ్మి వుంటే 2019లో జగన్‌కు అధికారం దక్కి వుండేది కాదు. అంతకు ముందు 2009లో వైఎస్ అఖండ విజయం సాధించి వుండేవాడు కాదు.

నిజానికి ..ఓ వ్యక్తి మరో వ్యక్తిని అకారణంగా ద్వేషించడు. ఓ వ్యక్తి లేదా ఓ సమూహం మరో వ్యక్తిని లేదా మరో సమూ హాన్ని పనిగట్టుకుని ద్వేషిస్తే. అణచివేయాలని కసిగా ప్రయత్నిస్తే, అప్పుడు పరిస్థితి వైలంట్‌గా మారుతుంది. పిల్లిని గదిలో వుంచి కొడితే పులి అయిపోతుంది అని సామెత. ఆంధ్రదేశంలో ఇప్పుడు అలుముకున్న కులపోరు లేదా కులా ల పోరు వెనుక ఇంతటి వ్యవహారమూ దాగి వుంది. 2004 నుంచి నుంచి 2019 వరకు ఆంధ్రదేశంలో జరిగిన సంఘట నల పర్యవసానమే ఇప్పుడు నడుస్తున్న కులసమరం.  కేవలం ఓ వ్యక్తి తన కులం కోసమో, తనది ఫలానా కులం అనో, మరో కులాన్నో, మరో కులానికి చెందిన వ్యక్తినో దేషిస్తున్న ఉదంతం కాదు. నమ్మిన వారు చేసిన నమ్మక ద్రోహం ఫలితంగా నెలకొన్న పరిస్థితి.

అవును ఇదంతా ఆంధ్రలోని కమ్మ-రెడ్డి మధ్య జరుగుతున్నపోరు గురించే. అవును ఇదంతా ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్య వైఖరి గురించే. కమ్మవారు అంటూ నేరుగా ఎత్తి చూపుతున్న వ్యవహారం శైలి గురించే.  2004 నాటికి పరిస్థితి ఇలా లేదు. ఆనాటి పరిస్థితులు వేరు. ఆనాటి వ్యవహారాలు వేరు. ఆనాటి స్నేహాలు వేరు. కానీ మరి ఇఫ్పడు ఎందుకిలా?  పది పదిహేనేళ్ల కాలంలో ఇలా ఎందుకు మారిపోయింది. ఆంధ్ర దేశం మొత్తం కులాల కుంపటి ఎందుకయింది?

వైఎస్ పాదయాత్ర…
వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఓ అపూర్వ ఘట్టం. అప్పటి వరకు పాలనలో వున్న తెలుగుదేశం అనుకూల మీడియా సైతం, ఆ యాత్రకు లభిస్తున్న ప్రజాదరణ చూసి, కవరేజ్ చేయక తప్పని పరిస్థితి. భవిష్యత్ దర్శనం చేసిన అనేక మంది వైఎస్ పంచన చేరారు. లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ సంపాదించుకున్నారు. వైఎస్ అధికా రంలోకి వచ్చారు. అప్పుడు కూడా కమ్మవారి ప్రాబల్యానికి వచ్చిన లోటు లేదు. తండ్రి నీడన వున్న వైఎస్ జగన్ చుట్టూ కొలువు తీరిన అష్టదిగ్గజాలు అందరూ కమ్మవారే. మాట్రిక్స్ ప్రసాద్, కోనేరు ప్రసాద్, పివిపి, నాగార్జున, లగడపాటి రాజగోపాల్, ఇంకా ఎంతమందో. అన్నింటికి మించి నవయుగ కంపెనీ అంటే జగన్ కంపెనీ అనేంత ప్రచారం. ఇలా అంతా వారే…జగన్ వ్యాపార బంధాలు అన్నీ వారితోనే అని ప్రచారం.

పరిటాల హత్య తరువాత..
అలాంటిది ఒక్కసారిగా టేబుల్ టర్న్ అయిపోయింది. పరిటాల రవి హత్య కేసుతో అంతా మారిపోయింది. కాదు, కాదు మారిపోవడానికి కారణం అదే అని చాలా మంది భావన. కమ్మ వర్గం పూర్తిగా వైఎస్ జగన్ మీద పగ పట్టేసింది. ఎంత పగ పట్టేసింది అంటే 2009 ఎన్నికల ముందు తెలుగుదేశం అనుకూల పత్రికలు చూస్తే అర్థం అవుతుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ ప్రభుత్వం రాకూడదు అనే పట్టుదలతో వండి వార్చిన వార్తలుచెబుతాయి.

అదిగో అక్కడ ప్రారంభమైంది కుల యుద్దం. వైఎస్ చనిపోయాక తారా స్థాయికి వెళ్లిపో యింది. ఎన్ని దారులు వున్నాయో, అన్ని రకాల పని జరిపించవచ్చో, ఎన్ని రకాల జగన్ ను టార్గెట్ చేయవచ్చో, ఎన్ని విధాల అతగాడిని బజారుకు ఈడ్చవచ్చో, ఎన్ని రకాల అతని వ్యక్తి త్వ హననం చేయవచ్చో అంతా చేసారు. ఒక వ్యక్తిని ఇంతలా వేటాడ వచ్చా? ఒక వ్యక్తిని ఇంతలా వెంటాడ వచ్చా? ఓ వ్యక్తిని ఇంతలా టార్గెట్ చేయవచ్చా?  అని ఆశ్చర్యపోయేంతగా పని చేసారు.

సిఎమ్ కాకుండా అడ్డం పడ్డారు. ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం జరిపారు కేసులు వేయించారు. దర్యాప్తులు జరిపేలా చేసారు. నిత్యం ఆ దర్యాప్తు ఆధారంగా చిలవలు పలవలు అల్లి, జగన్ వ్యక్తిత్వాన్ని ఎంత బదనామ్ చేయాలో అంతా చేసారు.

ఏడాదికి పైగా జగన్‌ను జైలులో వుండేలా  చేసారు. జైలులో వుండగా ఒక్కరు అంటే ఒక్కరు పలకరించిన పాపాన పోలేదు. జగన్ చుట్టూ తిరిగిన మహానుభావులు అంతా మాయమైపోయారు. వ్యాపారాలు చేసుకున్నవారంతా మొహం చాటేసారు. జగన్ ను సిఎమ్ కాకుండా చేయడం కోసం కాంగ్రెస్‌కు తెలుగుదేశం అండగా నిలిచిం ది. కిరణ్ కుమార్ రెడ్డిని, రోశయ్యను భుజన మోసింది. జగన్ తో పనులు చేయించు కున్న వారంతా అవతార సమాప్తి చేసి, మళ్లీ కులాభిమానంతో ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోయారు.

ఒక్కడిని ఇంతమంది కలిసి ఇంతలా టార్గెట్ చేస్తే, ఎవరయినా ఏం చేస్తారు? మూడే మార్గాలు వీళ్లతో పోరాడ లేక మూలన కూర్చోవడం లేదాఎదురుతిరిగి పోరాడడం. ఇవికాక ఫ్రస్టేషన్ మరీ పీక్స్‌కు వెళ్లిపోతే ప్రాణాలు వదిలేసుకుంటాడు. కానీ జగన్ తిరుగుబాటు చేసాడు. పోరాడాడు. జనంలోకి వెళ్లి నిలిచాడు. జనానికి అర్థం అయింది. జగన్ ను అక్కున చేర్చుకున్నారు. సింహాసనం మీద కూర్చో పెట్టారు.

గేమ్ స్టార్ట్ నౌ…
జగన్ అనేవాడు మామూలు మనిషి కాదు. క్షమాగుణం అనువణువునా నింపేసు కున్నవాడు అసలే కాదు. జైలులో గడిపిన నిద్రలేని రాత్రులు ఇంకా గుర్తున్నాయి. తన మీద, తన వ్యక్తిత్వం మీద రాసిన వేలాది వ్యాసాలన్నీ కళ్ల ముందు గింగిరాలు తిరుగుతున్నాయి. ఎవరు ఎలాంటి వారు. ఎవరు నయవంచకులు. ఎవరు వ్యాపారం కోసం తన దగ్గర చేరి, ఆపద సమయంలో తనకు దూరం అయ్యారు అన్న క్లారిటీ పక్కాగా వుంది.

మనసు మండిపోతోంది. నమ్మి, చుట్టూ వుంచుకుని, వాళ్లతో వ్యాపారాలు చేస్తే, మాట తను పడ్డాడు. మూటలు వాళ్లకి వెళ్లాయి. అంతకన్నా బాధ కలిగించే అంశం ఏమిటంటే ఎన్నికల టైమ్ లో వైరి పక్షంలో చేరి, తననే ఓడించాలని కంకణం కట్టుకున్న సంగతి. ఇలా చేసిన వాళ్లంతా ఒకే సామాజిక వర్గం కావడం. తను పెద్దగా దగ్గరకు తీయకున్నా, తన సామాజిక వర్గమే తనకు కోటగా, అండగా నిలవడం.

అదీ కాక, గడచిన అయిదేళ్ల బాబు పాలనలో తనను ఎంతలా టార్గెట్ చేసారో, ప్రతి తప్పుకు తననే బాధ్యుడిని ఎలా చేయాలని చూసారో జగన్‌కు తెలియంది కాదు. ఇవన్నీ కలిసి జగన్ ను రాటు దేల్చాయి. ఓ విధమైన కసిని, కోపాన్ని కలిగించాయి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, సదరు సామాజికవర్గ జనాల వైఖరి మీద ఓ విరక్తిని పెంచాయి.

జనాలు కాదు..వ్యాపారులే
అలా అని జగన్‌కు కమ్మ సామాజిక వర్గం అంతటిమీదా కోపం లేదు. కేవలం కమ్మసామాజిక వర్గ రాజకీయనాయకులు, వ్యాపారుల మీదే. రాజకీయాలను వాడుకుని, వ్యాపారాలను చేసుకుంటూ, అవసరం తీరిపోయిన తరవాత పడవ తగలెట్టే టైపు జనాల మీదే.  మీడియాను అడ్డం పెట్టుకుని, తన క్యారెక్టర్ ను, తన బతుకును దారుణంగా దెబ్బతీయాలని చూసిన వారి మీదే.

ఇప్పుడు జగన్ వల్ల కమ్మ సామాజిక వర్గంలో ఎవరికి ఇబ్బంది. మీడియా పేరుతో ప్రభుత్వం నుంచి లబ్ది పొందేవారికి, అలాగే పనిలో పనిగా లెప్ట్ నుంచి ఆదాయం సంపాదించే వారికి, కోట్లకు కోట్లు కాంట్రాక్టులు చేసేవారికి, బాబు ప్రభుత్వం అండతో చెలరేగిపోయిన వారికి. అంతే తప్ప సామాన్యులకు కాదు.

వారికి అందాల్సిన పథకాలు అన్నీ మిగిలిన వారితో పాటు అందుతూనే వున్నాయి. వైకాపాలో వున్న అదే సామాజిక వర్గం వారికి జరగాల్సిన పనులు జరుగుతూనే వున్నాయి. కేవలం మళ్లీ పాత పరిచయాలతోనో, నక్క వినయాలతోనో పార్టీలో చేరాలనుకున్నవారికి కుదరడం లేదు. ఏదో విధంగా పార్టీ కి దగ్గరై మళ్లీ అయిదేళ్ల పాటు తమ వ్యాపారాలు యధావిథిగా సాగించుకోవాలనుకునే వారికి కుదరడం లేదు.

అవినీతి లేని ప్రభుత్వం
జగన్ మీద ఏడాది కాలంగా ఎప్పటి లాగే దేశం అనుకుల మీడియా రాయాల్సిన విధంగా రాస్తూనే వుంది. కరోనా టైమ్‌లో కూడా అయ్యో ఆంధ్రలో కరోనా విజంభణ ఎక్కువగా లేదే అని బాధపడుతోంది. ఎక్కువ వుండి వుంటే జగన్ వైఫల్యం అని టముకు వేద్దామని అనుకుంటోంది. కానీ గ్రౌండ్‌లెవెల్‌లో జనాలకు తెలుసుగా ప్రభు త్వం ఏం చేస్తోందో?  ఎలా చేస్తోందో?

అంతెందుకు ఏడాదికి ఒక్క అవినీతి వార్త రాయగలిగారా? ఈకలు పీకే వీళ్లకు ఒక్క ఈక అయినా దొరికిందా?  దొరికి వుంటే ఇలా వుండేదా వ్యవహారం. జగన్ చాలా పట్టుదలగా వున్నాడు. ఇంకా క్లియర్‌గా చెప్పా లంటే మొండిగా వున్నాడు. మళ్లీ మరోసారి అధికారం అందితే అందనీ, లేకుంటే పోనీ. అంతే తప్ప, మళ్లీ మరోసారి ఆ వర్గాన్ని తన చుట్టూ పెట్టుకుని, వాళ్లని పోషించి, అవసరం తీరాక, వాళ్లు మళ్లీ వాళ్ల గూటికి వెళ్లిపోయే అవకాశం ఇవ్వదలుచుకోలేదు.

అందుకే అన్ని పార్టీల్లోని కమ్మ సామాజిక వర్గ నాయకులు ఏకం అయ్యారు. అన్ని రంగాల్లోని కమ్మ సామాజికవర్గ నేతలు తమ వంతు చేయూత నిస్తున్నారు. సెల్ఫ్ స్టయి ల్డ్ ప్రజా నాయకులు, సత్తా నాయకులు, వేదిక నాయకులు అందరూ కూడా లోపల కులం పెట్టుకుని, బయటకు ప్రవచనాలు చేస్తున్నారు. వీరందరిని ఒక్క చేత్తో ఎదుర్కొం టున్నాడు జగన్.

జనాలకు తను అందిస్తున్న సంక్షేమ పథకాలు, అవినీతి లేకుండా అందిస్తున్న పాలన, ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లిన పాలనా వ్యవస్థ తనకు రక్ష అని భావిస్తున్నాడు.

చూడాలి. జగన్ ఈ పోరులో ఏ మేరకు విజయం సాధిస్తాడో? ఒక్కటి మాత్రం నిజం. మరొక్కసారి జగన్ ప్రజా విజయం సాధిస్తే, ఆ తరువాత ఆంధ్ర రాష్ర్ట కథే వేరుగా వుంటుంది. రాజకీయాలే వేరుగా వుంటాయి. అందులో సందేహం లేదు. అందుకే అభిమన్యుడిని ఒంటరిని చేసి కొట్టినట్లు అయిదేళ్ల లోపే కొట్టేయాలని తహ తహ లాడుతూ, సకల సైన్యాన్ని మోహరిస్తోంది సదరు సామాజిక వర్గం.

చాణక్య 
[email protected]